ఇంతవరకూ రాని కథతో... | UNDIPORAADHEY MOVIE updates | Sakshi
Sakshi News home page

ఇంతవరకూ రాని కథతో...

Published Sun, Jun 16 2019 3:26 AM | Last Updated on Sun, Jun 16 2019 3:26 AM

UNDIPORAADHEY MOVIE updates - Sakshi

తరుణ్‌ తేజ్, లావణ్య

మన జీవితంలోకి ఎంతమంది వచ్చినా మనల్ని చివరివరకూ ప్రేమించేది తల్లిదండ్రులే అనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘ఉండిపోరాదే’. తరుణ్‌ తేజ్, లావణ్య హీరోహీరోయిన్లుగా తెలుగు, కన్నడ భాషల్లో నవీన్‌ నాయని దర్శకత్వంలో లింగేశ్వర్‌ నిర్మించారు. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో ఉంది. ఈ చిత్రం ఆడియోను 23న రిలీజ్‌ చేయాలని చిత్రబృందం ప్లాన్‌ చేస్తోంది. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు సబు వర్గీస్‌ మాట్లాడుతూ– ‘‘సినిమాలో ప్రతి పాట సందర్భానుసారంగానే వస్తుంది.

దర్శక–నిర్మాతలిచ్చిన స్వేచ్ఛ వల్ల మంచి పాటలివ్వగలిగాను’’ అన్నారు. ‘‘అవకాశమిచ్చిన నిర్మాతగారికి జీవితాంతం రుణపడి ఉంటాను. ఇదో రియలిస్టిక్‌ స్టోరీ. కన్నడలో ఆడియో రిలీజ్‌ చేశాం. మా ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారనుకుంటున్నాం’’ అన్నారు నవీన్‌. ‘‘సినిమాను ప్రత్యేక శ్రద్ధతో తీశాం. ఇంతవరకూ తెరమీద రానటువంటి కథతో సినిమా ఉంటుంది. నాన్నపై రాసిన పాటకు సుద్ధాల అశోక్‌ తేజగారికి కచ్చితంగా అవార్డ్‌ వస్తుంది. జులై చివర్లో సినిమాను రిలీజ్‌ చేస్తున్నాం’’ అన్నారు నిర్మాత లింగేశ్వర్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement