సాగర తీరంలో.... | Sagara Theeramlo Audio Launch | Sakshi
Sakshi News home page

సాగర తీరంలో....

Published Sun, Jul 29 2018 12:50 AM | Last Updated on Fri, Jul 12 2019 4:40 PM

Sagara Theeramlo Audio Launch - Sakshi

దిశాంత్, ఐశ్వర్య అడ్డాల

‘‘దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ దగ్గర ధర్మారావు పని చేశాడు. టాలెంట్‌ ఉన్న దర్శకుడు. ‘సాగర తీరంలో’ ట్రైలర్‌ చాలా బాగుంది. భోలె చక్కటి సంగీతం అందించాడు. ఈ సినిమా మంచి హిట్‌ అవుతుందనే నమ్మకం ఉంది’’ అని దర్శకుడు రేలంగి నరసింహారావు అన్నారు. దిశాంత్, ఐశ్వర్య అడ్డాల జంటగా ధర్మారావు జగతా దర్శకత్వంలో తడాలా వీరభద్రరావు నిర్మించిన చిత్రం ‘సాగర తీరంలో ’. ఈ చిత్రం పాటలను రేలంగి నరసింహారావు, నిర్మాత మల్కాపురం శివకుమార్‌ విడుదల చేశారు. ‘‘అమలాపురం, ముమ్మిడివరం, యానాం, ఎన్‌. రామేశ్వరం, ఓడలరేవు, కొమరగిరిపట్నం తదితర తీర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్‌ చేశాం. త్వరలోనే సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు దర్శక, నిర్మాతలు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement