Aishwarya addala
-
సాగర తీరంలో....
‘‘దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ దగ్గర ధర్మారావు పని చేశాడు. టాలెంట్ ఉన్న దర్శకుడు. ‘సాగర తీరంలో’ ట్రైలర్ చాలా బాగుంది. భోలె చక్కటి సంగీతం అందించాడు. ఈ సినిమా మంచి హిట్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అని దర్శకుడు రేలంగి నరసింహారావు అన్నారు. దిశాంత్, ఐశ్వర్య అడ్డాల జంటగా ధర్మారావు జగతా దర్శకత్వంలో తడాలా వీరభద్రరావు నిర్మించిన చిత్రం ‘సాగర తీరంలో ’. ఈ చిత్రం పాటలను రేలంగి నరసింహారావు, నిర్మాత మల్కాపురం శివకుమార్ విడుదల చేశారు. ‘‘అమలాపురం, ముమ్మిడివరం, యానాం, ఎన్. రామేశ్వరం, ఓడలరేవు, కొమరగిరిపట్నం తదితర తీర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ చేశాం. త్వరలోనే సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు దర్శక, నిర్మాతలు. -
సాగర తీరంలో ప్రేమ
లాస్య ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై ధర్మారావు జగతా దర్శకత్వంలో తాడాల వీరభద్రరావు నిర్మిస్తున్న చిత్రం ‘సాగర తీరంలో’. దిశాంత్, ఐశ్వర్య అడ్డాల నాయకా నాయికలుగా నటించారు. కోనసీమలోని ముమ్మడివరం, పాండిచ్చేరి, యానాంలతో పాటు అనేక ప్రాంతాల్లో ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఈ సందర్భంగా చిత్రనిర్మాత వీరభద్రరావు మాట్లాడుతూ – ‘మా ‘సాగర తీరంలో’ చిత్రం యువతరానికి కనెక్టయ్యే అందమైన ప్రేమకథ. నవ్వులు పండించే కామెడీ, భయపెట్టే హారర్, థ్రిల్‌కు గురిచేసే సస్పెన్స్‌తో పాటు దేశభక్తి మిళితమైన క్లీన్ ఎంటర్టైనర్. నటీనటులందరూ అద్భుతంగా నటించారు’’ అన్నారు. ధర్మారావు మాట్లాడుతూ – ‘‘అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా తీశాం. ఎడిటింగ్ పూర్తి చేసుకుని డబ్బింగ్ చివరి దశలో ఉంది. అతి త్వరలో రిలీజ్ తేదీని ప్రకటిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: కిషన్ సాగర్, సంగీతం: భోలే, సహ నిర్మాతలు: తాడాల శశికళ, నార్ని రామలింగ ప్రసాద్. -
మై స్వీట్ హార్ట్
గోపీచరణ్, ఐశ్వర్య అడ్డాల జంటగా నటించిన ఎంటర్టైనర్ ‘నేత్ర’. ‘మై స్వీట్ హార్ట్’ అన్నది ఉప శీర్షిక. రెడ్డెం యాదకుమార్ దర్శకత్వంలో పీరికట్ల రాము నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. దర్శకుడు మాట్లాడుతూ– ‘‘లవ్, హారర్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. ‘వైజాగ్’ సత్యానంద్‌గారు కీలక పాత్ర చేశారు. వారి అబ్బాయి ఈ చిత్రం ద్వారా పరిచయమవుతున్నారు. ఉదయ్ నాగ్ రతన్ స్వరపరచిన పాటలకు మంచి స్పందన వస్తోంది. నేపథ్య సంగీతం సినిమాను మరో లెవల్‌కి తీసుకెళుతుంది’’ అన్నారు. ‘‘మేం అనుకున్న దానికంటే చిత్రం బాగా వచ్చింది. రిజల్ట్ విషయంలో నమ్మకంగా ఉన్నాం. యూత్‌తో పాటు కుటుంబ ప్రేక్షకులకూ ఈ చిత్రం నచ్చుతుంది’’ అని నిర్మాత రాము పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఎస్.వి. గోపాల్.