సాగర తీరంలో ప్రేమ | Sagara Theeramlo in post-production works | Sakshi
Sakshi News home page

సాగర తీరంలో ప్రేమ

Published Thu, May 17 2018 5:43 AM | Last Updated on Tue, Aug 28 2018 4:32 PM

Sagara Theeramlo in post-production works  - Sakshi

లాస్య ఆర్ట్స్‌ క్రియేషన్స్‌ పతాకంపై ధర్మారావు జగతా దర్శకత్వంలో తాడాల వీరభద్రరావు నిర్మిస్తున్న చిత్రం ‘సాగర తీరంలో’. దిశాంత్, ఐశ్వర్య అడ్డాల నాయకా నాయికలుగా నటించారు. కోనసీమలోని ముమ్మడివరం, పాండిచ్చేరి, యానాంలతో పాటు  అనేక ప్రాంతాల్లో ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఈ సందర్భంగా చిత్రనిర్మాత వీరభద్రరావు మాట్లాడుతూ – ‘మా ‘సాగర తీరంలో’ చిత్రం యువతరానికి కనెక్టయ్యే అందమైన ప్రేమకథ. నవ్వులు పండించే కామెడీ, భయపెట్టే హారర్, థ్రిల్‌కు గురిచేసే సస్పెన్స్‌తో పాటు దేశభక్తి మిళితమైన క్లీన్‌ ఎంటర్‌టైనర్‌. నటీనటులందరూ అద్భుతంగా నటించారు’’ అన్నారు. ధర్మారావు మాట్లాడుతూ – ‘‘అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా తీశాం. ఎడిటింగ్‌ పూర్తి చేసుకుని డబ్బింగ్‌ చివరి దశలో ఉంది. అతి త్వరలో రిలీజ్‌ తేదీని ప్రకటిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: కిషన్‌ సాగర్, సంగీతం: భోలే, సహ నిర్మాతలు: తాడాల శశికళ, నార్ని రామలింగ ప్రసాద్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement