Director Bala Speech at Visithiran Audio Launch: చిత్రం బాగుండకపోతే తన పేరు, బ్యానర్ పేరు వేయవద్దంటానని దర్శకుడు బాలా అన్నారు. ఈయన తన బి.స్టూడియో పతాకంపై నిర్మించిన చిత్రం విసిత్తిరన్. ఆర్.కె.సురేష్ కథానాయకుడిగా నటించిన ఇందులో నటి పూర్ణ, మధు వైశాలిని నాయికలుగా నటించారు. మలయాళ దర్శకుడు పద్మకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి జీ.వీ.ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు.
మంగళవారం చెన్నైలో జరిగిన ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో ఈ నిర్మాత, దర్శకుడు బాలా మాట్లాడుతూ మలయాళ చిత్రం జోసెఫ్ నచ్చడంతో తమిళంలో రీమేక్ చేయాలనుకుంటున్నప్పుడు తాను నటిస్తానని ఆర్.కె.సురేష్ అడిగారన్నారు. ఇక మలయాళ దర్శకుడు పద్మకుమార్‌నే తమిళ వెర్షన్‌కు పని చేయాల్సిందిగా కోరామన్నారు. చిత్రం మళయాళంలో కంటే బాగా వచ్చిందన్నారు. ఆర్.కె.సురేష్ చక్కగా నటించారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment