
తమ్మారెడ్డి, అక్షిత, హరికృష్ణ, శ్రీకాంత్, జొన్నలగడ్డ
దర్శకుడు జొన్నలగడ్డ శ్రీనివాసరావు తనయుడు హరికృష్ణ హీరోగా నటించిన చిత్రం ‘ప్రేమెంత పనిచేసె నారాయణ’. అక్షిత హీరోయిన్. జొన్నలగడ్డ శ్రీనివాసరావు దర్శకత్వంలో సావిత్రి జొన్నలగడ్డ నిర్మించిన ఈ సినిమా ట్రైలర్‌ను శనివారం విడుదల చేశారు. దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ– ‘‘శ్రీనివాసరావు మంచి దర్శకుడు. ‘ఎదురులేని మనిషి, జగపతి, బంగారు బాబు, ఢీ అంటే ఢీ’ వంటి చాలా సినిమాలు చేశారు. హరికృష్ణ నటన, డాన్స్ చూస్తుంటే మంచి హీరో అవుతాడనిపిస్తోంది’’ అన్నారు. ‘‘పాటలు, ట్రైలర్ బాగున్నాయి.
హరికృష్ణకి మంచి ఎనర్జీ ఉంది’’ అన్నారు హీరో శ్రీకాంత్. ‘‘నిజజీవితంలో జరిగిన వాస్తవ సంఘటనతో తీసిన సినిమా ఇది. లవ్ స్టోరీ అయినా కొత్తగా ఉంటుంది. దర్శకుడిగా ఇది నా 9వ సినిమా. క్లైమాక్స్ సరికొత్తగా ఉంటుంది. జగపతిబాబుగారి వాయిస్ ఓవర్ మా సినిమాలో హైలైట్. త్వరలోనే í విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు జొన్నలగడ్డ శ్రీనివాసరావు. రచయిత పరచూరి వెంకటేశ్వర రావు, డైరెక్టర్లు డాలీ, కిశోర్ కుమార్, హరికృష్ణ, అక్షిత తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: భాగ్యలక్ష్మి, సంగీతం: యాజమాన్య, కెమెరా: పి.ఎస్. వంశీ ప్రకాష్.