రంగా, అక్షత, అజయ్
అజయ్, రంగా, అక్షత ముఖ్య పాత్రల్లో నందమ్ శ్రీవాత్సవ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘స్పెషల్’. హైదరాబాద్‌లో ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘‘ఓ క్రిమినల్ ఒక రకమైన ఇంజెక్షన్‌ను వాడుతూ చాలామందికి హాని తలపెడుతుంటాడు. అసలు ఆ ఇంజెక్షన్ చుట్టూ ఏం జరుగుతుందనే విషయాన్ని తెలుసుకునే పోలీస్ అధికారి పాత్రలో నటించాను.
నా కెరీర్‌లో ఇది ప్రత్యేకమైన చిత్రం’’ అని అజయ్ అన్నారు. ‘‘మైండ్ రీడర్‌గా మారిన ఓ సైకో ఏం చేశాడు? అతన్ని పోలీసులు పట్టుకున్నారా? అనే అంశాలు ఈ సినిమాలో ఆసక్తికరంగా ఉంటాయి. మైండ్ రీడర్ పాత్రలో రంగా నటించారు. కీలకపాత్రలో అక్షత కనిపిస్తారు. సినిమా ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అన్నారు నందమ్. ఈ చిత్రానికి విన్.వి.ఎస్. మణ్యం సంగీతం అందించారు. బి. అమరకుమార్ ఛాయాగ్రాహకుడు.
Comments
Please login to add a commentAdd a comment