ranga
-
మైండ్ రీడింగ్ సైకో
అజయ్, రంగా, అక్షత ముఖ్య పాత్రల్లో నందమ్ శ్రీవాత్సవ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘స్పెషల్’. హైదరాబాద్‌లో ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘‘ఓ క్రిమినల్ ఒక రకమైన ఇంజెక్షన్‌ను వాడుతూ చాలామందికి హాని తలపెడుతుంటాడు. అసలు ఆ ఇంజెక్షన్ చుట్టూ ఏం జరుగుతుందనే విషయాన్ని తెలుసుకునే పోలీస్ అధికారి పాత్రలో నటించాను. నా కెరీర్లో ఇది ప్రత్యేకమైన చిత్రం’’ అని అజయ్ అన్నారు. ‘‘మైండ్ రీడర్‌గా మారిన ఓ సైకో ఏం చేశాడు? అతన్ని పోలీసులు పట్టుకున్నారా? అనే అంశాలు ఈ సినిమాలో ఆసక్తికరంగా ఉంటాయి. మైండ్ రీడర్ పాత్రలో రంగా నటించారు. కీలకపాత్రలో అక్షత కనిపిస్తారు. సినిమా ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అన్నారు నందమ్. ఈ చిత్రానికి విన్.వి.ఎస్. మణ్యం సంగీతం అందించారు. బి. అమరకుమార్ ఛాయాగ్రాహకుడు. -
మనసు చదివేస్తాడు
‘విక్రమార్కుడు’ సినిమాలో ప్రతినాయకుడిగా అందరి ప్రశంసలు అందుకున్నారు అజయ్. పలు చిత్రాల్లో హీరోగా, విలన్‌గా, సహాయ నటుడిగా నటిస్తున్న ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం ‘స్పెషల్’. వాస్తవ్ దర్శకత్వంలో నందలాల్ క్రియేషన్స్ పతాకంపై నందమ్ శ్రీవాస్తవ్ నిర్మించారు. వాస్తవ్ మాట్లాడుతూ– ‘‘ఇదొక మైండ్ రీడర్ స్టోరీ. ఓ వ్యక్తిని ఒక అమ్మాయి లవ్ చేసి వదిలేస్తుంది. ఆ అమ్మాయి అతన్ని మోసం చేయడానికి కారణమైన వాళ్ల మీద ఈ మైండ్ రీడర్ పగ తీర్చుకుంటాడు. మనుషుల్ని టచ్ చేసి, వాళ్ల మైండ్ రీడ్ చేసే ఒక పారాసైకాలజీ స్కిల్ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. హాలీవుడ్ తరహా కథాంశంతో తీసిన ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్ ఇది. అజయ్ పోలీస్ ఆఫీసర్‌గా నటించారు’’ అన్నారు. ‘‘ఫ్యాంటసీ లవ్ యాక్షన్ షేడ్స్‌తో నడిచే చిత్రమిది. కథ, కథనం, ట్విస్టులు ఈ చిత్రానికి ప్రధాన బలం. ఇందులోని డైలాగ్స్ ప్రేక్షకులకు కొత్త ఫీలింగ్‌ని ఇస్తాయి. ఈనెల 29న టీజర్‌ను, నవంబర్ చివరి వారంలో సినిమాని రిలీజ్ చేస్తాం’’ అని శ్రీవాస్తవ్ అన్నారు. రంగ, అక్షత, సంతోష, అశోక్ కుమార్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: ఎన్వీఎస్ మన్యం, కెమెరా: బి అమర్ కుమార్. -
అప్పుడు మాకు నిద్రపట్టలేదు...!
అజయ్, రంగ, అక్షిత, సంతోష ముఖ్యతారాగణంగా నందనాల్ క్రియేషన్స్ పతాకంపై వాస్తవ్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘స్పెషల్’. ద స్టోరీ ఆఫ్ ఏ మైండ్ రీడర్ అనేది ఉపశీర్షిక. ఎన్వీయస్ మణ్యం స్వరకర్త. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ– ‘‘లవ్ అండ్ రివెంజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఇది. ఆల్మోస్ట్ షూటింగ్ కంప్లీట్ చేశాం. మా చిత్రానికి అజయ్‌గారు బ్యాక్‌బోన్ లాంటి వారు. ఇన్వెస్టిగెటివ్ ఆఫీసర్‌గా ఆయన మేము ఊహించిన దాని కన్నా సూపర్‌గా నటించారు. సైకాలజీ డాక్టర్ అశోక్‌కుమార్, అక్షిత, సంతోష, రంగా బాగా నటించారు. మా సినిమా కాస్త షూటింగ్ జరిగిన తర్వాత ‘రాజుగారి గది 2’ లో నాగార్జున మైండ్ రీడర్‌గా చేస్తున్నారని తెలిసింది. అప్పుడు మాకు నిద్రపట్టలేదు. కానీ, సినిమా చూశాక నాగార్జునగారి క్యారెక్టర్ చూసి, హ్యాపీ ఫీలయ్యాం. ఆయన నటన ఎక్స్లెంట్. మా మైండ్ రీడర్‌కి, ‘రాజుగారి గది–2’ మైండ్ రీడర్‌కి పోలిక లేదు’’ అన్నారు. ‘‘కథ వినగానే ఇలాంటి కాన్సెప్ట్ చిత్రాలు ప్రేక్షకులు నచ్చుతాయా అని ఆలోచించాను. కానీ, అవుట్‌పుట్ బాగా వచ్చింది. మంచి క్యారెక్టర్ చేస్తున్నాను’’ అన్నారు అజయ్. ‘ఈ చిత్రంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ క్యారెక్టర్ చేశాను’’ అన్నారు రంగా. అశోక్‌కుమార్, ఎస్వీయస్ మణ్యం, అక్షిత పాల్గొన్నారు. -
రిజర్వేషన్లు సాధించే వరకు ఉద్యమిస్తాం
మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రాధేయపాలెంలో రంగా విగ్రహావిష్కరణ రాజానగరం : కాపులకు బీసీ రిజర్వేషన్ సదుపాయం కల్పించే వరకు తాము చేపట్టిన ఉద్యమం ఆగదని, ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ప్రాణం ఉన్నంతవరకు న్యాయపోరాటం చేస్తూనే ఉంటానని కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. కాపులంతా సమైక్యతతో ముందుకు వచ్చి ఉద్యమంలో పాలుపంచుకుంటేనే భావితరాల భవిషత్తు బాగుంటుందన్నారు. రాజానగరం మండలం రాధేయపాలెంలో రంగ మిత్రమండలి ఆధ్వర్యంలో నిర్మించిన వంగవీటి మోహనరంగ విగ్రహాన్ని ముద్రగడ ఆదివారం విష్కరించారు. అనంతరం వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ మండారపు వీర్రాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దశాబ్దాలుగా పాలకుల దగాకు గురై నిద్రపోతున్న కాపుజాతిని తాను అధికారంలోకి వస్తే బీసీల్లో చేరుస్తానంటూ మేలుకొలిపిన చంద్రబాబును తాను ఇచ్చిన మాటను నెరవేర్చమని కోరుతున్నామన్నారు. అంతేగానీ తాము నేరాలు, ఘోరాలు చేయడం లేదన్నారు. రిజర్వేషన్ల సాధనకు వెనుకడుగు వేసేది లేదని, మున్ముందు రోజుల్లో కూడా ఈ పోరాట పటిమను ఇలాగే కొనసాగిస్తూ ఉద్యమంలో చురుకైన పాత్ర వహించాలని యువతకు పిలుపునిచ్చారు. ఈ ప్రాంతంలో మీకు నిరంతరం అండగా నిలుస్తున్న జక్కంపూడి కుటుంబానికి కూడా మీరెప్పుడూ అండగా ఉండాలని కోరుతున్నానన్నారు. కులమతాలకు అతీతంగా పేదలందరికీ అండగా నిలిచి వారి పాలిట పెన్నిధిగా నిలిచిన వంగవీటి మోహనరంగా అని వైఎస్సార్సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి అన్నారు. రిజర్వేషన్లు సాధించే వరకు కాపు ఉద్యమం ఆగదని కాపు ఉద్యమ నాయకుడు ఆకుల రామకృష్ణ అన్నారు. ఇక్కడ జరుగుతున్న కాపు ఉద్యమ ప్రభావం తెలంగాణ రాష్ట్రంలో కూడా కనిపిస్తుందన్నారు. కాపుల ఆత్మ గౌరవానికి చిహ్నంగా నిలిచిన రంగా విగ్రహావిష్కరణలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. రంగా, జక్కంపూడి రామ్మోహనరావు వంటి వారు జనంలో ఏనాడూ చిరంజీవులుగానే ఉంటారన్నారు. వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ వైఎస్సార్సీపీ కోఆర్డినేటర్ ఆకుల వీర్రాజు, కాపు ఉద్యమ నాయకులు ఏసుదాసు, కలవకొలను తాతాజీ, జక్కంపూడి గణేష్, అనదాసు సాయిరామ్, పేపకాయల విష్ణుమూర్తి, ద్వారంపూడి నాగమునేశ్వర్రావు, గండి నానిబాబు, ఉండమట్ల రాజబాబు, దేశాల శ్రీను, జక్కంపూడి జగపతిరావు, ప్రగడ చక్రి, అబ్బిరెడ్డి వెంకటేశ్వర్రావు, బీసీ సంఘాల నాయకులు వాసంశెట్టి పెద్దవెంకన్న, గోసాల చిన్న, రంగమిత్ర మండలి అధ్యక్షుడు సాపిరెడ్డి దుర్గారావు, సభ్యులు పాల్గొన్నారు. నేతల విగ్రహాల సంరక్షణ కూడా చూడాలి విగ్రహాలను ఏర్పాటుచేయడంతోనే పని అయిపోయిందనుకోవద్దని, వాటిని దుమ్ముధూళి, మలినాల నుంచి కాపాడుతుండాలని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అన్నారు. ఇందుకు తాము బాధ్యత తీసుకుంటామని కాపు నాయకులు ఆకుల వీర్రాజు, జక్కంపూడి గణేష్ మాట ఇచ్చిన తరువాతనే తాను ఈ కార్యక్రమానికి వచ్చానన్నారు. -
నాడు రంగాను... నేడు ముద్రగడ ప్రాణం తీస్తారా ?
చిత్తూరు మాజీ ఎమ్మెల్యే ఏఎస్మనోహర్ ఆందోళన చిత్తూరు (అర్బన్): ‘అప్పుడు ఆమరణదీక్షలో ఉన్న కాపు నాయకుడు రంగాను చంపించారు. ఇప్పుడూ అదే ఆమరణ దీక్షలో ఉన్న ముద్రగడ పద్మనాభాన్ని మట్టుబెట్టాలని చూస్తున్నారు. ఆయనకేమైనా జరిగితే టీడీపీ భారీ మూల్యం చెల్లించుకోకతప్పదు’ అని జిల్లా బలిజ (కాపు) సంఘ నాయకులు, చిత్తూరు మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్ హెచ్చరించారు. శనివారం చిత్తూరులోని తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో రాజకీయ పార్టీలు కాపులను ఓట్ల కోసం వాడుకుని వదిలేస్తున్నాయే తప్ప వారి భవిష్యత్తుపై ఆలోచన చేయడం లేదన్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాకమునుపు సీఎం అయితే ఆర్నెలల్లో కాపుల్ని బీసీల్లో చేరుస్తామని, ఏటా వెయ్యి కోట్లు కార్పొరేషన్‌కు ఇస్తామని చెప్పడం వల్లే నేడు ముద్రగడ ఆ హామీల అమలు కోసం పోరాడుతున్నాడన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ కల్పించడం వల్ల గత నాలుగేళ్లలో 350 మందికి ఎంబీబీఎస్ సీట్లు వచ్చాయన్నారు. తమను కూడా బీసీల్లో చేర్చి నిరుపేదలుగా ఉన్న కాపు యువత అభ్యున్నతికి తోడ్పడాలని కోరారు. తునిలో జరిగిన ఘటనలో బాబు తొలుత సీమకు చెందిన వారే బాధ్యులని తప్పుడు ప్రకటనలు ఇచ్చారని, ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన వ్యక్తులను అరెస్టు చేయడమే ఇందుకు సాక్ష్యమని తెలిపారు. ‘సాక్షి’పత్రికలో రాసినట్లు ప్రస్తుతం జిల్లాలో కాపులు వీధుల్లో అడుగుపెట్టకుండా పోలీసులు వెంటాడుతున్నారని వాపోయారు. తనకు సైతం పోలీసుల నుంచి వేధింపులు తప్పడంలేదన్నారు. ముఖ్యమంత్రి కమిటీలతో కాలయాపన చేయకుండా వెంటనే కాపులకు రిజర్వేషన్లు కల్పించడంపై ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సంఘ నాయకులు అమరనాథ్, వేణుగోపాల్, లోకేష్, కుట్టిరాయల్, రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. -
రంగా హత్య వెనుక బాబు హస్తం!
'60 వసంతాల నా రాజకీయ ప్రస్థానం' పుస్తకంలో మాజీ మంత్రి హరిరామజోగయ్య సంచలన వ్యాఖ్యలు * బాబు ప్రోద్బలంతోనే ఆ దారుణహత్య జరిగింది * రంగా హత్య గురించి నాకు వారం రోజుల ముందే సమాచారం వచ్చింది * నాకు సన్నిహితుడైన అత్తిలి మాజీ ఎమ్మెల్యే శివరామరాజు ఈ విషయం చెప్పారు * రంగాను బతకనిస్తే టీడీపీకి మనుగడ ఉండదని కొందరు చంద్రబాబును ఆశ్రయించారని తెలిపారు * అతడ్ని అంతమొందించేందుకు అనుమతివ్వాలని కోరగా.. చంద్రబాబు పచ్చజెండా ఊపారని చెప్పారు * ఆ తరువాత వారం రోజులకే రంగా దారుణహత్య వార్త వినాల్సి వచ్చింది * ఇందులో చంద్రబాబునాయుడు పాత్ర రుజువైంది * నాడు వంగవీటి మోహనరంగాకు భద్రత ఇవ్వకుండా అడ్డుకున్నదీ చంద్రబాబే సాక్షి ప్రతినిధి, ఏలూరు రెండున్నర దశాబ్దాల కిందట రాష్ట్ర రాజకీయాల్ని ఒక్క కుదుపు కుదిపిన విజయవాడ మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగా హత్యోదంతంపై సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య తన 'అరవై వసంతాల నా రాజకీయ ప్రస్థానం' పుస్తకంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. వంగవీటి రంగా హత్య వెనుక చంద్రబాబు హస్తముందని, ఆయన ప్రోద్బలంతోనే ఆ దారుణహత్య జరిగిందని అందులో పేర్కొన్నారు. రంగాకు నాడు భద్రతను పునరుద్ధరించకుండా అడ్డుకున్నదీ చంద్రబాబేనని తెలిపారు. అప్పట్లో తెలుగుదేశం పార్టీలో ఉన్న తనకు వంగవీటి రంగా హత్య గురించి ముందుగానే తెలిసిందన్నారు. రంగాను బతకనిస్తే పార్టీకి మనుగడ ఉండదని, అతడ్ని అంతమొందించేందుకు అనుమతివ్వాలంటూ నాడు విజయవాడకు చెందిన ఒక శాసనసభ్యుడు, రైల్వే కార్మిక సంఘ నేత ప్రభాకరరాజు పార్టీ నేతలతో కలసి చంద్రబాబు నాయుడును ఆశ్రయించగా.. ఆయన పచ్చజెండా ఊపారని తనకు సన్నిహితుడైన అత్తిలి మాజీ ఎమ్మెల్యే శివరామరాజు... రంగా హత్యకు వారం రోజులముందు తనతో చెప్పారని జోగయ్య తన పుస్తకంలో వివరిం చారు. శివరామరాజు చెప్పినట్టే ఆ తరువాత వారం రోజులకు రంగా దారుణహత్య వార్తను వినాల్సి వచ్చిందని తెలిపారు.'అరవై వసంతాల రాజకీయ ప్రస్థానం'పేరిట జోగయ్య రచించిన ఆ పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో జరిగింది. కాగా 150 పేజీల పుస్తకంలో జోగయ్య తన రాజకీయ జీవితంలో చోటుచేసుకున్న ఎన్నో విశేషాలను, వివాదాలను, విషాదాలను, మలుపులను ప్రస్తావించారు. ఆ క్రమంలో 71, 72, 73 పేజీల్లో కాపునాడు కలతలు శీర్షికన రంగా హత్యోదంతాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. ఆ వివరాలు ఆయన రాసిన మాటల్లోనే.. విజయవాడలో'మహానాడు'విజయవంతంగా ముగిసిన కొద్దినెలలకే అదే ప్రాంగణంలో కాపు సామాజికవర్గ నేతలు కాపునాడు నిర్వహించారు. లక్షమందికిపైగా కాపు కులస్తులు హాజరైన ఆ సభలో కాపు నాయకులు ఎన్టీఆర్‌ను తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. దీంతో కలత చెందిన ఎన్టీఆర్ నన్ను పిలిచి.. ఎందుకు మీ వాళ్లంతా(కాపుకులస్తులు) నన్ను వ్యతిరేకిస్తున్నారు? కారణమేమిటీ? అని అడిగారు. దానికి సమాధానంగా నేను'ఈ మధ్యకాలంలో కాపు కులస్తులకు మన ప్రభుత్వంపై కోపం రావడానికి ముఖ్య కారణం తమ కులస్తుడైన విజయవాడ ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగారావుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన భద్రతను ఉపసంహరించడమేనని చెప్పాను. రంగాకు భద్రతను పునరుద్ధరిస్తే అసంతృప్తి తగ్గుతుందని చెప్పాను. ఆ సూచనను ఆయన ఆమోదించి అలానే చేస్తానన్నారు. కానీ మరునాటి ఉదయం కలసినప్పుడు 'సారీ జోగయ్యగారు.. మీ సలహా ప్రకారం చేయలేకపోతున్నాను. చంద్రబాబు తదితరులు ఇప్పుడే మార్పులు చేయొద్దు.. పరిస్థితి యథాతథంగా కొనసాగించడమే మంచిదంటున్నారు'అని అన్నారు ఎన్టీఆర్. సరే మీ ఇష్టం అని ఊరుకున్నాను. హత్యకు ముందే నాకు సమాచారమొచ్చింది... ఆ తర్వాత కొద్దిరోజులకు నాకు బాగా సన్నిహితుడైన అత్తిలి మాజీ ఎమ్మెల్యే దండు శివరామరాజు నాతో చెప్పిన మాట ఏమిటంటే... 'ఇక వంగవీటి రంగా ఎన్నాళ్లో బతికేటట్టు లేడు. అతడిని అంతమొందించే ప్రయత్నాలు జరుగుతున్నట్టు విశ్వసనీయమైన సమాచారం అందింది' అన్నారు. దానిని నేను నమ్మకపోవడంతో 'విజయవాడ వాస్తవ్యుడు రైల్వే కార్మికసంఘ నాయకుడు(ప్రభాకరరాజు) నాకీ సమాచారమిచ్చాడు. ఆ వ్యక్తి సిరీస్ సుబ్బరాజుకు మిక్కిలి సన్నిహితుడు. నాకు కూడా బాగా సన్నిహితుడు కాబట్టి నమ్మాలి'అని శివరామరాజు అన్నారు. రంగా బతికితే టీడీపీకి మనుగడ లేదన్నారు విజయవాడకు చెందిన ఒక శాసనసభ్యుడు, రైల్వే కార్మికసంఘ నేత ప్రభాకరరాజు కొందరు పార్టీ వాళ్లతో ఎన్టీఆర్‌ని కలసి..'రంగాను బతకనిస్తే విజయవాడలో మన పార్టీకి మనుగడ లేదు. అతణ్ణి అంతమొందించేందుకు మాకు అనుమతివ్వండి'అని అడిగితే ఎన్టీఆర్'అటువంటివి తనకిష్టం లేదని'కరాకండీగా చెప్పడంతో వాళ్లు చంద్రబాబు, ఉపేంద్రలను ఆశ్రయించారని, వాళ్ల ప్రతిపాదనకు వారిరువురూ పచ్చజెండా ఊపారని ప్రభాకరరాజు తనతో చెప్పినట్టు శివరామరాజు చెప్పారు. రంగా హత్యకు జరిగిన కుట్ర వెనుక చంద్రబాబు, ఉపేంద్ర, సిరీస్ సుబ్బరాజు గార్ల హస్తాలు ఉన్నాయని శివరామరాజుగారు నాతో అన్నారు. తర్వాత వారం రోజులకే రంగా హత్య వార్త వినవలసి వచ్చింది. నిరాహారదీక్ష చేస్తున్న వంగవీటి మోహనరంగాను శిబిరంలోనే అతి కిరాతకంగా హతమార్చారు. విజయవాడ అట్టుడికిపోయింది. తెలుగుదేశంపార్టీ వారు ఒక కాపు నాయకుడ్ని తమకు వ్యతిరేకపార్టీలో ఉండి జనాదరణ పొందుతున్నాడన్న కారణంతో పైశాచికంగా హతమార్చడం నన్ను కలిచివేసింది. ఈ వివరాలను నేనిప్పుడు కొత్తగా చెప్పడం లేదు. ఆ రోజులలోనే అనేక పబ్లిక్ మీటింగులలో, పత్రికా సమావేశాలలోనూ ప్రకటించాను. నేను ఏదైతే రాశానో దానికి కట్టుబడి ఉన్నా: హరిరామజోగయ్య పుస్తకావిష్కరణ తర్వాత అందులో పేర్కొన్న అన్ని విషయాలకంటే ఎక్కువగా రంగా హత్యోదంతం.. చంద్రబాబు పాత్ర ప్రస్తావన చర్చనీయాంశమైంది. ఈ విషయమై ఆదివారం రాత్రి జోగయ్యతో ‘సాక్షి’ ప్రతినిధి మాట్లాడగా.. 'నేను ఏదైతే రాశానో దానికి కట్టుబడి ఉన్నాను. నేను వాస్తవాలే రాశాను. ఇన్నాళ్ల తర్వాత అబద్ధం రాస్తే నాకేం వస్తుంది?'అని ఆయన అన్నారు. ఆ కేసును పునర్విచారణ చేపట్టాలి మా నాన్న హత్య కేసును పునర్విచారణ చేపట్టాలి. హత్య తర్వాత సుమారు పుష్కరకాలంపైగా సాగిన సీబీఐ విచారణ అసమగ్రంగా పూర్తయింది. ఇప్పటికీ సాక్ష్యాలు సజీవంగా ఉన్నాయి. నిజాయితీగా విచారణ చేపడితే అసలు నిందితులు బయటికొస్తారు. ఆ కేసులో చంద్రబాబుదే ప్రధానపాత్ర అని ఎవరైనా చెబుతారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమైనా స్పందించి రంగా హత్య కేసును పునర్విచారణకు ఆదేశించాలి. -వంగవీటి రాధా, రంగా తనయుడు ముమ్మాటికే బాబుదే ఆ పాపం.. ముమ్మాటికీ ఆ పాపం చంద్రబాబుదే. ఇది ఇప్పుడు మేము అంటున్న మాట కాదు. హత్యకు సరిగ్గా 24 గంటలకు ముందు స్వయంగా రంగానే.. చంద్రబాబు అండ్ కో తన హత్యకు కుట్ర పన్నుతున్నారంటూ ప్రభుత్వానికి లేఖ రాశారు. అదే లేఖను కేంద్ర హోంమంత్రికి కూడా పంపారు. ఆ లేఖ అందేలోపే ఆయన దారుణహత్యకు గురయ్యారు. జోగయ్య రాసింది అక్షరాలా వాస్తవం. - వంగవీటి రత్నకుమారి, రంగా సతీమణి -
వంగవీటి మోహనరంగాకు అంబటి నివాళి
-
ఎన్నాళ్ళీ హత్యా రాజకీయాలు ?