ఘనంగా హీరో కుమార్తె ఎంగేజ్ మెంట్ | Vikram's daughter gets engaged to Karunanidhi's grandson | Sakshi
Sakshi News home page

ఘనంగా హీరో కుమార్తె ఎంగేజ్ మెంట్

Published Mon, Jul 11 2016 12:38 PM | Last Updated on Mon, Sep 4 2017 4:37 AM

ఘనంగా హీరో కుమార్తె ఎంగేజ్ మెంట్

ఘనంగా హీరో కుమార్తె ఎంగేజ్ మెంట్

చెన్నై: కోలీవుడ్ హీరో ‘చియాన్’ విక్రమ్ కుమార్తె అక్షిత వివాహ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఆదివారం స్టార్ హోటల్లో సన్నిహితుల సమక్షంలో జరిగిన అక్షిత-మను రంజిత్ యంగేజ్మెంట్కు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు. వీరిద్దరి వివాహం వచ్చే సంవత్సరం చేయాలని పెద్దలు నిర్ణయించారు. సీకే బేకరీ యజమాని రంగనాథన్ కుటుంబానికి చెందిన మను రంజిత్, అక్షిత ప్రేమించుకున్నారు. వీరి ప్రేమకు పెద్దలు అంగీకారం తెలిపారు. కాగా, మను రంజిత్ ఎవరో కాదు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి కుమారుడు ముత్తు మనవడు.

నిశ్చితార్థానికి విక్రమ్ కు సన్నిహితుడు, ప్రముఖ దర్శకుడు శంకర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు సన్నిహితులు ట్వీట్ చేశారు. కుమార్తె వివాహాన్ని ఘనంగా జరిపించేందుకు విక్రమ్ ఏర్పాట్లు చేసుకుంటున్నారు.


Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement