Manu Ranjit
-
ఘనంగా హీరో కుమార్తె ఎంగేజ్ మెంట్
చెన్నై: కోలీవుడ్ హీరో ‘చియాన్’ విక్రమ్ కుమార్తె అక్షిత వివాహ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఆదివారం స్టార్ హోటల్లో సన్నిహితుల సమక్షంలో జరిగిన అక్షిత-మను రంజిత్ యంగేజ్మెంట్కు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు. వీరిద్దరి వివాహం వచ్చే సంవత్సరం చేయాలని పెద్దలు నిర్ణయించారు. సీకే బేకరీ యజమాని రంగనాథన్ కుటుంబానికి చెందిన మను రంజిత్, అక్షిత ప్రేమించుకున్నారు. వీరి ప్రేమకు పెద్దలు అంగీకారం తెలిపారు. కాగా, మను రంజిత్ ఎవరో కాదు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి కుమారుడు ముత్తు మనవడు. నిశ్చితార్థానికి విక్రమ్ కు సన్నిహితుడు, ప్రముఖ దర్శకుడు శంకర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు సన్నిహితులు ట్వీట్ చేశారు. కుమార్తె వివాహాన్ని ఘనంగా జరిపించేందుకు విక్రమ్ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. -
కరుణకు బంధువు కానున్న విక్రమ్
చియాన్ విక్రమ్ డీఎంకే అధినేత కరుణానిధికి బంధువు కాబోతున్నారు. ప్రముఖ కథానాయకుడిగా వెలుగొందుతున్న నటుడు విక్రమ్. ఈయన తాజాగా మామ అనే అంతస్తును అందుకోనున్నారు. విక్రమ్ కూతురు అక్షిత పెళ్లికూతురు కానున్నారు. ఏమిటీ విక్రమ్‌కు పెళ్లీడుకొచ్చిన కూతురు ఉందా? అని ఆశ్చర్యపోతున్నారా? ఇలాంటి సమయాల్లోనే నటుల అసలు వయసు బయట పడుతుంది. విక్రమ్ 50 ఏళ్ల వయసును అధిగమించారు. ఆయన కూతురు అక్షితకు మను రంజిత్‌కు వివాహం నిశ్చయం అయ్యింది. జూలై 10న చెన్నైలోని ఒక నక్షత్ర హోటల్లో నిశ్చితార్థం జరగనుంది. కాగా మను రంజిత్ ఎవరో కాదు డీఎంకే నేత కరుణానిధి కొడుకు ముత్తు మనవడు. అక్షిత, మను రంజిత్ల వివాహ నిశ్చితార్థాన్ని కుటుంబ సభ్యుల సమక్షంలోనే నిర్వహించనున్నారు. అయితే 2017లో జరగనున్న వీరి వివాహాన్ని ఘనంగా జరిపించడానికి నటుడు విక్రమ్ సిద్ధం అవుతున్నారు. ఈ వివాహానికి సినీ, రాజకీయ ప్రముఖలు పెద్ద ఎత్తున హాజరయ్యే అవకాశం ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. -
పెళ్లిపీటలు ఎక్కబోతున్న హీరో కూతురు
చెన్నై: హీరో 'చియాన్' విక్రమ్ కుమార్తె అక్షిత త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతోంది. సీకే బేకరీ యజమాని రంగనాథన్ కుటుంబానికి చెందిన మను రంజిత్ తో అక్షిత పెళ్లి జరగనుందని సన్నిహిత వర్గాల సమాచారం. వీరిద్దరి యంగేజ్ మెంట్ ఘనంగా నిర్వహించేందుకు విక్రమ్ ఏర్పాట్లతో నిమగ్నమైన్నట్టు తెలుస్తోంది. జులై 10న చెన్నైలోని స్టార్ హోటల్ లో అక్షిత-రంజిత్ నిశ్చితార్థం జరగనుందని సమాచారం. ఈ వేడుకకు ఇరు కుటుంబాలకు చెందిన సన్నిహితులను మాత్రమే ఆహ్వానించనున్నట్టు తెలుస్తోంది. అక్షిత-రంజిత్ వివాహం వచ్చే ఏడాది జరుగుతుందని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. విక్రమ్ నటించిన 'కారికాలన్' సినిమా ఆగస్టులో విడుదల కానుంది. 'ఇరు మురుగన్' చిత్రాన్ని సెప్టెంబర్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 'గరుడా' సినిమా వచ్చే ఏడాది మార్చిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు.