పెళ్లిపీటలు ఎక్కబోతున్న హీరో కూతురు | Vikram's daughter to get engaged in July | Sakshi
Sakshi News home page

పెళ్లిపీటలు ఎక్కబోతున్న హీరో కూతురు

Published Mon, Jun 27 2016 2:18 PM | Last Updated on Mon, Sep 4 2017 3:33 AM

పెళ్లిపీటలు ఎక్కబోతున్న హీరో కూతురు

పెళ్లిపీటలు ఎక్కబోతున్న హీరో కూతురు

చెన్నై: హీరో 'చియాన్' విక్రమ్ కుమార్తె అక్షిత త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతోంది. సీకే బేకరీ యజమాని రంగనాథన్ కుటుంబానికి చెందిన మను రంజిత్ తో అక్షిత పెళ్లి జరగనుందని సన్నిహిత వర్గాల సమాచారం. వీరిద్దరి యంగేజ్ మెంట్ ఘనంగా నిర్వహించేందుకు విక్రమ్ ఏర్పాట్లతో నిమగ్నమైన్నట్టు తెలుస్తోంది. జులై 10న చెన్నైలోని స్టార్ హోటల్ లో అక్షిత-రంజిత్ నిశ్చితార్థం జరగనుందని సమాచారం. ఈ వేడుకకు ఇరు కుటుంబాలకు చెందిన సన్నిహితులను మాత్రమే ఆహ్వానించనున్నట్టు తెలుస్తోంది. అక్షిత-రంజిత్ వివాహం వచ్చే ఏడాది జరుగుతుందని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.

విక్రమ్ నటించిన 'కారికాలన్' సినిమా ఆగస్టులో విడుదల కానుంది. 'ఇరు మురుగన్'  చిత్రాన్ని సెప్టెంబర్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 'గరుడా' సినిమా వచ్చే ఏడాది మార్చిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement