కరుణకు బంధువు కానున్న విక్రమ్ | Image for the news result Vikram's daughter getting engaged to Karunanidhi's great grandson | Sakshi
Sakshi News home page

కరుణకు బంధువు కానున్న విక్రమ్

Published Tue, Jun 28 2016 3:23 AM | Last Updated on Mon, Sep 4 2017 3:33 AM

కరుణకు బంధువు కానున్న విక్రమ్

కరుణకు బంధువు కానున్న విక్రమ్

చియాన్ విక్రమ్ డీఎంకే అధినేత కరుణానిధికి బంధువు కాబోతున్నారు. ప్రముఖ కథానాయకుడిగా వెలుగొందుతున్న నటుడు విక్రమ్. ఈయన తాజాగా మామ అనే అంతస్తును అందుకోనున్నారు. విక్రమ్ కూతురు అక్షిత పెళ్లికూతురు కానున్నారు. ఏమిటీ విక్రమ్‌కు పెళ్లీడుకొచ్చిన కూతురు ఉందా? అని ఆశ్చర్యపోతున్నారా? ఇలాంటి సమయాల్లోనే నటుల అసలు వయసు బయట పడుతుంది. విక్రమ్ 50 ఏళ్ల వయసును అధిగమించారు. ఆయన కూతురు అక్షితకు మను రంజిత్‌కు వివాహం నిశ్చయం అయ్యింది.

జూలై 10న చెన్నైలోని ఒక నక్షత్ర హోటల్‌లో నిశ్చితార్థం జరగనుంది. కాగా మను రంజిత్ ఎవరో కాదు డీఎంకే నేత కరుణానిధి కొడుకు ముత్తు మనవడు. అక్షిత, మను రంజిత్‌ల వివాహ నిశ్చితార్థాన్ని కుటుంబ సభ్యుల సమక్షంలోనే నిర్వహించనున్నారు. అయితే 2017లో జరగనున్న వీరి వివాహాన్ని ఘనంగా జరిపించడానికి నటుడు విక్రమ్ సిద్ధం అవుతున్నారు. ఈ వివాహానికి సినీ, రాజకీయ ప్రముఖలు పెద్ద ఎత్తున హాజరయ్యే అవకాశం ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement