గతేడాది ఫిబ్రవరిలో ఓ వేడుకలో హఠాత్తుగా ఎలా వచ్చాడో గానీ... ఓ అభిమాని వచ్చాడు. వచ్చీ రావడమే హీరో విక్రమ్‌ను హత్తుకున్నాడు. సెక్యూరిటీ, అవార్డు ఫంక్షన్ నిర్వాహకులు అతన్ని పంపించబోతే... విక్రమ్ వారించి, సెల్ఫీ దిగి పంపించారు. విక్రమ్‌కు ఫ్యాన్స్ అంటే ప్రేమని ఆయన సన్నిహితులు చెప్పే మాట! అందుకేనేమో ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళ ఫ్యాన్స్‌ను కుమార్తె రిసెప్షన్‌కి ఆహ్వానించి ఉంటారు. డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మునిమనవడు మనోరంజిత్, విక్రమ్ కుమార్తె అక్షిత పెళ్లి ఇటీవల చెన్నైలో జరిగింది. ఆదివారం పాండిచ్చేరి దగ్గరలోని పట్టనూర్‌లో రిసెప్షన్ జరిగింది. ఈ వేడుకకి పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు విచ్చేసి, నూతన వధూవరులను ఆశీర్వదించారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి వేలసంఖ్యలో వచ్చిన విక్రమ్ ఫ్యాన్సూ ఆశీర్వదించారు. ఫ్యాన్స్ కోరిక మేరకు రిసెప్షన్‌లో విక్రమ్ పాట పాడడం విశేషం. దాంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ!
మరి, అమెరికాలో అదేంటి:
ఇండియాలో విక్రమ్‌కి మంచి పేరుంది. కానీ, గతేడాది ఆగస్టులో అమెరికాలో నిర్వహించిన ‘ఇండియన్ డే పరేడ్’లో విక్రమ్ అమర్యాదగా ప్రవర్తించారట! విక్రమ్‌ను ‘యారగెంట్ యాక్టర్’గా అభివర్ణించారు యూఎస్ తమిళ సంఘం అధ్యక్షుడు ప్రకాశ్ ఎం. స్వామి. ‘‘వుయ్ ఆర్ డిజప్పాయింటెడ్ విత్ యు విక్రమ్. ఫోనులో మాట్లాడుకుంటావనీ, మెస్సేజులు చేసుకుంటావనీ నిన్ను ఆహ్వానించలేదు. అభిషేక్ బచ్చన్ ఫ్యాన్స్‌కి షేక్ హ్యాండ్ ఇస్తూ డౌన్ టు ఎర్త్‌గా ఉంటే, విక్రమ్ యారగెంట్ యాటిట్యూడ్ చూపించారు. ఫ్యాన్స్‌కి ‘హాయ్’ కూడా చెప్పలేదు. శరత్‌కుమార్, రాధికలు సహనంతో ఫొటోలకు పోజులిచ్చారు. శరత్‌కుమార్‌కన్నా అతను గొప్పవాడా? రజనీ, షారూఖ్ అనుకుంటున్నాడా? షేమ్ ఆన్ యు (విక్రమ్)’’ అని ఫేస్‌బుక్‌లో ప్రకాశ్ ఎం. స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఆరోపణలను ఎఫ్‌ఐఏ (ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్) ఖండించింది. ‘‘పరేడ్‌లో పాల్గొన్నందుకు విక్రమ్‌కి థ్యాంక్స్. నటుడిగా, సౌతిండియన్‌గా కాకుండా విక్రమ్ ఓ భారతీయుడిగా ఈ ఈవెంట్‌కి వచ్చారు. ప్రకాశ్ ఎం. స్వామి ఆరోపణలు నిజం కాదు’’ అని ఓ పత్రికా ప్రకటనలో ఎఫ్‌ఐఏ పేర్కొంది. మరి.. అమెరికాలో విక్రమ్ రూడ్‌గా ప్రవర్తించి ఉంటే.. అమెరికాలో అలా... ఇండియాలో ఇలా... రియల్ లైఫ్‌లోనూ విక్రమ్‌లో అపరిచితుడు ఉన్నాడా?!!
అపరిచితుడా?!
Published Tue, Nov 7 2017 12:38 AM | Last Updated on Tue, Nov 7 2017 9:53 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment