సావిత్రి, హరికృష్ణ, శ్రీనివాసరావు, అక్షిత
‘ప్రేమెంత పనిచేసే నారాయణ’ అనే పాట ఎంత ఫేమస్సో అందరికీ తెలుసు. ఇప్పుడు అదే టైటిల్‌తో ఓ సినిమా తెరకెక్కింది. హరికృష్ణ జొన్నలగడ్డ, అక్షిత జంటగా నటించారు. భాగ్యలక్ష్మీ సమర్పణలో జె.ఆర్.యస్ మూవీస్ పతాకంపై జొన్నలగడ్డ శ్రీనివాసరావు దర్శకత్వంలో ఈ చిత్రాన్ని సావిత్రి జొన్నలగడ్డ నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్ 5న రిలీజ్ కానుంది. జొన్నలగడ్డ శ్రీనివాసరావు మాట్లాడుతూ– ‘‘దర్శకునిగా నాకిది తొమ్మిదో చిత్రం. పెద్ద హీరోలతో సినిమాలు చేశాను.
ఈ కథ వైవిధ్యంగా ఉండటంతో నా కుమారుడిని హీరోగా పరిచయం చేస్తున్నాను. ఇలాంటి పాయింట్ ఇంతవరకూ ఏ డైరెక్టర్ టచ్ చేయలేదు. క్లైమాక్స్ సీన్స్‌కు ప్రేక్షకులు ఖచ్చితంగా క్లాప్స్ కొడతారు’’ అన్నారు. ‘‘అన్ని జనరేషన్స్‌కు కనెక్ట్ అయ్యే ప్రేమ కథ ఇది. సినిమా చూస్తున్నంత సేపు ఓ కొత్త కథను చూస్తున్నామనే ఫీలింగ్ కలుగుతుంది. ప్రేమలో బాధను ఈ సినిమా తెలియచేస్తుంది. ప్రేమికులైతే ఇలాంటి అనుభవాలు మన జీవితంలో కూడా ఉన్నాయనుకుంటారు. కథలో చాలా ట్విస్టులుంటాయి. తప్పకుండా విజయం సాధిస్తాం’’ అన్నారు హీరో హరికృష్ణ.
Comments
Please login to add a commentAdd a comment