Harikrishna Jonnalagadda
-
‘మరిన్ని థియేటర్లు దొరికితే బాగుండేది’
హరికృష్ణ, అక్షిత జంటగా జొన్నలగడ్డ శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ప్రేమెంత పనిచేసే నారాయణ. జెఎస్ఆర్ మూవీస్ పతాకంపై సావిత్రి ఈ సినిమా ఈనెల 22న విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. హీరో హరికృష్ణ మాట్లాడుతూ, ‘తొలి షోతోనే సినిమాకు మంచి టాక్ వచ్చింది. ప్రేక్షకుల ఆదరణ బాగుంది. మంచి రివ్యూలు వచ్చాయి. అంతా హరి బాగా చేసాడంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. నటన, డాన్సులు, డైలాగులు బాగా చెప్పాడని క్రిటిక్స్ నుంచి సైతం ప్రశంసలు దక్కాయి. మొదటి సినిమాతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకున్నందుకు సంతోషంగా ఉంది. ఇలాంటి సినిమాకు మరిన్ని థియేటర్లు దొరికితే బాగుండేది’ అన్నారు. దర్శకుడు జొన్నలగడ్డ శ్రీనివాసరావు మాట్లాడుతూ ‘ ఎదురు లేని మనిషి, మా అన్నయ్య బంగారం, బంగారు బాబు, జగపతి ఇలా చాలా సినిమాలను డైరెక్ట్ చేసాను. స్టార్ హీరోలు నాగార్జున, జగపతిబాబు, బాలకృష్ణ, రాజశేఖర్, శ్రీకాంత్ గారితో చేసాను. కో డైరెక్టర్‌గా ఎన్నో సినిమాలకు పనిచేసిన అనుభవం ఉంది. కానీ ఈ కథ కొత్త వాళ్లతో చేస్తేనే బాగుంటుందని చేసా. అందుకే మా అబ్బాయిని హీరోగా పరిచయం చేసా. సినిమా చూసిన వారంతా హరి బాగా చేసాడని ఫోన్లు చేసి చెబుతున్నారు. ఇండస్ర్టీలో ఉన్న సన్నిహితులు కూడా హరి డాన్సులు, ఫైట్లు, యాక్టింగ్ చక్కగా చేసాడని మెచ్చుకున్నారు. ప్రేక్షకుల ఆదరణ ఎంతో బాగుంది. క్రిటిక్స్ సైతం ప్రశంసించారు. కానీ ఒకటే అసంతృప్తి... థియేటర్లు ఎక్కువగా దొరికి ఉంటే బాగుండేది. థియేటర్లు పెంచుతారని ఆశిస్తున్నా. అంత అనుభవం ఉన్నా థియేటర్లు సంపాదించుకోలేకపోయాననే బాధ ఉంది’ అని అన్నారు. హీరోయిన్ అక్షిత మాట్లాడుతూ, ‘మా నమ్మకాన్ని ప్రేక్షకులు నిలబెట్టారు. అందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. సినిమాకు మంచి రివ్యూలు వచ్చాయి. కొత్త వాళ్లని ఇలాగే ఆదరించాలని కోరుకుంటున్నా’ అన్నారు. -
ప్రేమెంత పనిచేసె నారాయణ టీమ్‌తో ప్రత్యేక ఇంటర్వ్యూ
-
సినిమాలు తప్ప వేరే ప్రపంచం తెలీదు
దర్శకుడు జొన్నలగడ్డ శ్రీనివాసరావు తనయుడు హరికృష్ణ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘ప్రేమెంత పనిచేసె నారాయణ’. అక్షిత కథానాయికగా నటించారు. ఝాన్సీ కీలక పాత్ర చేశారు. జొన్నలగడ్డ శ్రీనివాసరావు దర్శకత్వంలో సావిత్రి జొన్నలగడ్డ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది. హైదరాబాద్‌లో జరిగిన ప్రీ–రిలీజ్ వేడుకలో ముఖ్య అతిథిగా వచ్చిన నటుడు శ్రీకాంత్ ఈ సినిమా సంగీత దర్శకుడు యాజమాన్యకు తొలి జ్ఞాపికను అందజేశారు. అనంతరం శ్రీకాంత్ మాట్లాడుతూ– ‘‘శ్రీనివాసరావుకు సినిమాలు తప్ప వేరే ప్రపంచం తెలీదు. ఆయన తనయుడు హరిని హీరోగా పరిచయం చేస్తూ, తనే ఈ సినిమా అన్ని బాధ్యతలను తీసుకుని శ్రమించారు. హరి బాగా హార్డ్‌వర్క్ చేస్తాడు. భవిష్యత్‌లో స్టార్ అవుతాడు’’ అన్నారు. ‘‘కథను నమ్మి చేసిన చిత్రమిది. ఈ కథకి కొందరు ఇచ్చిన సలహాలు నచ్చలేదు.. అందుకే నేను తీయాలనుకున్నది తీసాను. హిందీ డబ్బింగ్ రైట్స్‌కు కూడా మంచి ధర దక్కింది. ఈ సినిమాకు ఎంతో సపోర్ట్ చేస్తున్న నిర్మాత అల్లు అరవింద్‌గారి సహకారం మర్చిపోలేనిది’’ అన్నారు జొన్నలగడ్డ శ్రీనివాసరావు. ‘‘ప్రేమకు కొత్త అర్థం చెప్పే చిత్రమిది. స్నేహం విలువను చాటిచెప్పే కథ’’ అన్నారు హరికృష్ణ. రచయిత మరుదూరి రాజా, నటుడు కాశీవిశ్వనాథ్, హీరోయిన్ అక్షిత మాట్లాడారు. -
‘ప్రేమెంత పనిచేసె నారాయణ’ ప్రీ రిలీజ్ ఫంక్షన్
తన కుమారుడు హరికృష్ణ జొన్నలగడ్డను హీరోగా పరిచయం చేస్తూ దర్శకుడు జొన్నలగడ్డ శ్రీనివాసరావు తెరకెక్కిస్తున్న చిత్రం ‘ప్రేమెంత పనిచేసె నారాయణ’. జొన్నలగడ్డ శ్రీనివాసరావు.. నాగార్జున హీరోగా ఎదురులేని మనిషి సినిమాతో డైరెక్టర్ మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. హరికృష్ణ, అక్షిత జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని భాగ్యలక్ష్మి సమర్పణలో జె.ఎస్. ఆర్ మూవీస్ పతాకంపై సావిత్రి జొన్నలగడ్డ నిర్మిస్తున్నారు. అన్ని పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఫిబ్రవరి 22న రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు చిత్రయూనిట్. ఈ సందర్భంగా ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఆదివారం హైదరాబాద్‌లో సినీ ప్రముఖల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ నటుడు శ్రీకాంత్ సంగీత దర్శకుడు యాజమాన్యకు తొలి జ్ఞాపికను అందజేశారు. అనంతరం శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘శ్రీనివాసరావు చాలా సంవత్సరాలుగా నాకు తెలుసు. ఆయనకు సినిమా తప్ప మరో ప్రపంచం లేదు. వాళ్ల అబ్బాయిని హీరోగా పరిచయం చేస్తూ.. అన్ని బాధ్యతలను తీసుకుని ఎన్ని కష్టాలు ఎదురైనా ప్యాషన్‌తో శ్రమించాడు. హరిలో మంచి జిల్ ఉంది. సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. భవిష్యత్తులో మంచి స్టార్ అవుతాడ’ని అన్నారు. కాశీ విశ్వనాథ్ మాట్లాడుతూ.. ‘శ్రీనివాసరావు గత చిత్రాల్లో నేను నటించాను. నచ్చావులే తర్వాత అలాంటి మంచి పాత్ర ఈ సినిమాలో దొరికింది. ఆ సినిమా కన్నా ఈ చిత్రం పెద్ద సక్సెస్ కావాల’ని కోరారు. మరుదూరి రాజా మాట్లాడుతూ.. హరిలో మంచి ఫైర్ ఉందన్నారు. మంచి కథతో హరి హీరోగా పరిచయం అవుతున్నాడని తెలిపారు. హీరో, ఝాన్సీ పాత్రల మధ్య సవాల్‌తో ఈ కథ నడుస్తుందని పేర్కొన్నారు. సినిమా కోసం తండ్రీ కొడుకులిద్దరూ ఎంతగానో కష్టపడ్డారని చెప్పారు. హరికృష్ణ మాట్లాడుతూ.. రెగ్యూలర్ లవ్ స్టోరీలకు భిన్నంగా ఈ చిత్రం ఉంటుందని అన్నారు. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. ప్రేమ అంటే అమ్మాయి, అబ్బాయి ఉంటే సరిపోతుందని అనుకుంటారు.. కానీ స్నేహితుడు లేకపోతే ప్రేమ లేదని చెప్పే సినిమా ఇది అని తెలిపారు. దర్శకనిర్మాతలు తల్లిదండ్రులైనా చాలా ప్రొఫెషనల్‌గా వ్యవహరించారని పేర్కొన్నారు. హీరోయిన్ అక్షిత మాట్లాడుతూ.. ఈ సినిమా చాలా రియలిస్టిక్‌గా ఉంటుందని అన్నారు. చాలా సన్నివేశాలు ఎమోషన్‌తో నడుస్తాయని తెలిపారు. దర్శకుడు జొన్నలగడ్డ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ‘సీనియర్ ఎన్టీఆర్ నటించిన మేజర్ చంద్రకాంత్‌తో పాటు చాలా సినిమాలకు నేను పనిచేసాను. తర్వాత కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించాను. సినిమా బాగా వచ్చిందని నమ్ముతున్నాను. అల్లు అరవింద్ మా సినిమాకు ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు. ఈ నెల 22న చిత్రం ప్రేక్షకుల మందుకు రానుంద’ని తెలిపారు. -
ఫిబ్రవరి 22న ‘ప్రేమెంత పనిచేసె నారాయణ’
హరికృష్ణ జొన్నలగడ్డ, అక్షిత జంటగా నటిస్తోన్న రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ప్రేమెంత పనిచేసె నారాయణ’. భాగ్యలక్ష్మి సమర్పణలో జె.ఎస్. ఆర్ మూవీస్ పతాకంపై సావిత్రి జొన్నలగడ్డ ఈ సినిమానునిర్మిస్తున్నారు. నాగార్జున హీరోగా ఎదురులేని మనిషి సినిమాతో డైరెక్టర్ మంచి గుర్తింపు తెచ్చుకున్న జొన్నలగడ్డ శ్రీనివాసరావు ఈ సినిమాకు దర్శకుడు. అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ సినిమాను ఫిబ్రవరి 22న రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు చిత్రయూనిట్. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు జొన్నలగడ్డ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ‘సినీ పరిశ్రమలో 30 ఏళ్ల నుంచి ఉంటున్నాను. చాలా మంది పెద్ద హీరోల సినిమాలకు పనిచేసాను. దర్శకుడిగా నాకిది తొమ్మిదవ సినిమా. కథ వైవిధ్యంగా ఉందనే నా కుమారుడిని ఈ సినిమా తో హీరోగా పరిచయం చేస్తున్నా. రెగ్యులర్ లవ్ స్టోరీలకు భిన్నంగా ఉంటుంది. క్లైమాక్స్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. ఇండస్ట్రీ పెద్దల సహకారం, సూచనలతో ఫిబ్రవరి 22వ తేదిన రిలీజ్ డేట్ గా ఫిక్స్ చేసాం. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే సినిమా ఇది’ అని అన్నారు. హీరో హరికృష్ణ మాట్లాడుతూ, ‘అన్నీ జనరేషన్లకు కనెక్ట్ అయ్యే ప్రేమకథా చిత్రమిది. సినిమా చూస్తే ఓ కొత్త కథను చూస్తున్నామనే అనుభూతి కలుగుతుంది. సినిమా చాలా బాగా వచ్చింది. మా సినిమాకు మీడియా కూడా మంచి పబ్లిసీటీ ఇచ్చింది. తప్పకుండా విజయం సాధిస్తాం’ అన్నారు. -
ఆడియన్స్ చప్పట్లు కొడతారు
‘ప్రేమెంత పనిచేసే నారాయణ’ అనే పాట ఎంత ఫేమస్సో అందరికీ తెలుసు. ఇప్పుడు అదే టైటిల్‌తో ఓ సినిమా తెరకెక్కింది. హరికృష్ణ జొన్నలగడ్డ, అక్షిత జంటగా నటించారు. భాగ్యలక్ష్మీ సమర్పణలో జె.ఆర్.యస్ మూవీస్ పతాకంపై జొన్నలగడ్డ శ్రీనివాసరావు దర్శకత్వంలో ఈ చిత్రాన్ని సావిత్రి జొన్నలగడ్డ నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్ 5న రిలీజ్ కానుంది. జొన్నలగడ్డ శ్రీనివాసరావు మాట్లాడుతూ– ‘‘దర్శకునిగా నాకిది తొమ్మిదో చిత్రం. పెద్ద హీరోలతో సినిమాలు చేశాను. ఈ కథ వైవిధ్యంగా ఉండటంతో నా కుమారుడిని హీరోగా పరిచయం చేస్తున్నాను. ఇలాంటి పాయింట్ ఇంతవరకూ ఏ డైరెక్టర్ టచ్ చేయలేదు. క్లైమాక్స్ సీన్స్‌కు ప్రేక్షకులు ఖచ్చితంగా క్లాప్స్ కొడతారు’’ అన్నారు. ‘‘అన్ని జనరేషన్స్‌కు కనెక్ట్ అయ్యే ప్రేమ కథ ఇది. సినిమా చూస్తున్నంత సేపు ఓ కొత్త కథను చూస్తున్నామనే ఫీలింగ్ కలుగుతుంది. ప్రేమలో బాధను ఈ సినిమా తెలియచేస్తుంది. ప్రేమికులైతే ఇలాంటి అనుభవాలు మన జీవితంలో కూడా ఉన్నాయనుకుంటారు. కథలో చాలా ట్విస్టులుంటాయి. తప్పకుండా విజయం సాధిస్తాం’’ అన్నారు హీరో హరికృష్ణ. -
అక్టోబర్ 5న ‘ప్రేమెంత పనిచేసే నారాయణ’
హరికృష్ణ జొన్నలగడ్డ, అక్షిత జంటగా నటిస్తోన్న చిత్రం ‘ప్రేమెంత పనిచేసే నారాయణ’. జొన్నలగడ్డ శ్రీనివాసరావు దర్శకత్వంలో సావిత్రి జొన్నలగడ్డ నిర్మిస్తున్న ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని అక్టోబర్ 5న సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు జొన్నలగడ్డ శ్రీనివాసరావు మాట్లాడుతూ, ‘సినీ పరిశ్రమలో 30 ఏళ్ల నుంచి ఉంటున్నాను. చాలా మంది పెద్ద హీరోల సినిమాలకు పనిచేసాను. దర్శకుడిగా నాకిది తొమ్మిదవ సినిమా. కథ వైవిథ్యంగా ఉందనే నా కుమారుడిని ఈ సినిమాతో హీరోగా పరిచయం చేస్తున్నా. రెగ్యులర్ లవ్ స్టోరీలకు భిన్నంగా ఉంటుంది. క్లైమాక్స్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది’ అన్నారు. హీరో హరికృష్ణ మాట్లాడుతూ, ‘అన్నీ జనరేషన్స్‌కు కనెక్ట్ అయ్యే ప్రేమకథా చిత్రమిది. సినిమా చూస్తున్నంత సేపు ఓ కొత్త కథను చూస్తున్నామనే అనుభూతి కలుగుతుంది. ప్రేమలో బాధను సినిమా తెలియజేస్తుంది. ప్రేమికులైతే ఇలాంటి అనుభవాలు మన జీవతంలో కూడా ఉన్నాయనుకుంటారు. కథలో చాలా ట్విస్టులుంటాయి. సినిమా చాలా బాగా వచ్చింది. తప్పకుండా విజయం సాధిస్తామన్న నమ్మకం ఉంది’ అన్నారు. ఈ కార్యక్రమంలో యూనిట్ సభ్యులు, చిత్ర నిర్మాత సావిత్రి జొన్నలగడ్డ తదితరులు పాల్గొన్నారు.