హరికృష్ణ, అక్షిత జంటగా జొన్నలగడ్డ శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ప్రేమెంత పనిచేసే నారాయణ. జెఎస్ఆర్ మూవీస్ పతాకంపై సావిత్రి ఈ సినిమా ఈనెల 22న విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
హీరో హరికృష్ణ మాట్లాడుతూ, ‘తొలి షోతోనే సినిమాకు మంచి టాక్ వచ్చింది. ప్రేక్షకుల ఆదరణ బాగుంది. మంచి రివ్యూలు వచ్చాయి. అంతా హరి బాగా చేసాడంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. నటన, డాన్సులు, డైలాగులు బాగా చెప్పాడని క్రిటిక్స్ నుంచి సైతం ప్రశంసలు దక్కాయి. మొదటి సినిమాతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకున్నందుకు సంతోషంగా ఉంది. ఇలాంటి సినిమాకు మరిన్ని థియేటర్లు దొరికితే బాగుండేది’ అన్నారు.
దర్శకుడు జొన్నలగడ్డ శ్రీనివాసరావు మాట్లాడుతూ ‘ ఎదురు లేని మనిషి, మా అన్నయ్య బంగారం, బంగారు బాబు, జగపతి ఇలా చాలా సినిమాలను డైరెక్ట్ చేసాను. స్టార్ హీరోలు నాగార్జున, జగపతిబాబు, బాలకృష్ణ, రాజశేఖర్, శ్రీకాంత్ గారితో చేసాను. కో డైరెక్టర్‌గా ఎన్నో సినిమాలకు పనిచేసిన అనుభవం ఉంది. కానీ ఈ కథ కొత్త వాళ్లతో చేస్తేనే బాగుంటుందని చేసా. అందుకే మా అబ్బాయిని హీరోగా పరిచయం చేసా. సినిమా చూసిన వారంతా హరి బాగా చేసాడని ఫోన్లు చేసి చెబుతున్నారు.
ఇండస్ర్టీలో ఉన్న సన్నిహితులు కూడా హరి డాన్సులు, ఫైట్లు, యాక్టింగ్ చక్కగా చేసాడని మెచ్చుకున్నారు. ప్రేక్షకుల ఆదరణ ఎంతో బాగుంది. క్రిటిక్స్ సైతం ప్రశంసించారు. కానీ ఒకటే అసంతృప్తి... థియేటర్లు ఎక్కువగా దొరికి ఉంటే బాగుండేది. థియేటర్లు పెంచుతారని ఆశిస్తున్నా. అంత అనుభవం ఉన్నా థియేటర్లు సంపాదించుకోలేకపోయాననే బాధ ఉంది’ అని అన్నారు. హీరోయిన్ అక్షిత మాట్లాడుతూ, ‘మా నమ్మకాన్ని ప్రేక్షకులు నిలబెట్టారు. అందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. సినిమాకు మంచి రివ్యూలు వచ్చాయి. కొత్త వాళ్లని ఇలాగే ఆదరించాలని కోరుకుంటున్నా’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment