అక్టోబ‌ర్ 5న ‘ప్రేమెంత ప‌నిచేసే నారాయ‌ణ‌’ | Prementha Pani Chese Narayana Movie Release Date | Sakshi
Sakshi News home page

Published Sat, Sep 22 2018 3:18 PM | Last Updated on Sat, Sep 22 2018 3:18 PM

Prementha Pani Chese Narayana Movie Release Date - Sakshi

హ‌రికృష్ణ జొన్నల‌గ‌డ్డ‌, అక్షిత జంట‌గా న‌టిస్తోన్న చిత్రం ‘ప్రేమెంత ప‌నిచేసే నారాయ‌ణ‌’. జొన్నల‌గడ్డ శ్రీనివాస‌రావు ద‌ర్శక‌త్వంలో సావిత్రి జొన్నల‌గ‌డ్డ నిర్మిస్తున్న ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని అక్టోబ‌ర్ 5న సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సంద‌ర్భంగా చిత్ర ద‌ర్శకుడు జొన్నల‌గ‌డ్డ శ్రీనివాస‌రావు మాట్లాడుతూ, ‘సినీ ప‌రిశ్రమ‌లో 30 ఏళ్ల నుంచి ఉంటున్నాను. చాలా మంది పెద్ద  హీరోల సినిమాల‌కు ప‌నిచేసాను. ద‌ర్శకుడిగా నాకిది తొమ్మిద‌వ సినిమా. క‌థ వైవిథ్యంగా ఉంద‌నే నా కుమారుడిని ఈ సినిమాతో హీరోగా ప‌రిచ‌యం చేస్తున్నా. రెగ్యుల‌ర్ ల‌వ్ స్టోరీల‌కు భిన్నంగా ఉంటుంది. క్లైమాక్స్ ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా సాగుతుంది’ అన్నారు.

హీరో హ‌రికృష్ణ మాట్లాడుతూ, ‘అన్నీ జ‌న‌రేష‌న్స్‌కు క‌నెక్ట్ అయ్యే ప్రేమ‌క‌థా చిత్రమిది.  సినిమా చూస్తున్నంత సేపు ఓ కొత్త క‌థ‌ను చూస్తున్నామ‌నే అనుభూతి క‌లుగుతుంది. ప్రేమలో బాధ‌ను సినిమా తెలియ‌జేస్తుంది.  ప్రేమికులైతే ఇలాంటి అనుభ‌వాలు మ‌న జీవ‌తంలో కూడా ఉన్నాయనుకుంటారు. కథ‌లో చాలా ట్విస్టులుంటాయి. సినిమా చాలా బాగా వ‌చ్చింది. త‌ప్పకుండా విజ‌యం సాధిస్తామన్న నమ్మకం ఉంది’ అన్నారు. ఈ కార్యక్రమంలో యూనిట్ స‌భ్యులు, చిత్ర నిర్మాత సావిత్రి జొన్నల‌గ‌డ్డ త‌దిత‌రులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement