
దర్శకురాలిగా స్థిరపడతా..
హైదరాబాద్: 'సినిమాలకు దర్శకత్వం వహించడం అంటే బాగా ఇష్టం. విజయనిర్మల లాంటి సీనియర్ డెరైక్టర్‌లు నాకు స్ఫూర్తి' అంటోంది అక్షిత. తాజాగా నగరంలో జరిగిన మిస్ ట్విన్ సిటీ కాంటెస్ట్‌లో టైటిల్ దక్కించుకున్న ఈ బ్యూటీ.. బుధవారం సోమాజిగూడలో ఆంధ్రాహొజైరీ అవుట్‌లెట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతం తమిళ, కన్నడ భాషల్లో సినిమాల్లో నటిస్తున్నానని, అలాగే ఒక సినిమాకి దర్శకత్వం కూడా చేస్తున్నానని తెలిపారు. నటన కొనసాగిస్తూనే దర్శకత్వం చేయాలనేది తన ఆకాంక్ష అని చెప్పారు. ఈ కార్యక్రమంలో మిస్ ట్విన్ సిటీ కాంటెస్ట్‌లో ద్వితీయ, తృతీయ స్థానాలు దక్కించుకున్న నీలోఫర్, నికితలు కూడా పాల్గొన్నారు.