
శివ కందుకూరి
‘ఛలో’ సినిమాలోని ‘చూసీ చూడంగానే నచ్చేసావే..’ పాట గత ఏడాది ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. ఈ పాట పల్లవిలోని ‘చూసీ చూడంగానే...’ పదాలను టైటిల్‌గా పెట్టుకున్నారు శివ కందుకూరి. ‘పెళ్లి చూపులు, మెంటల్ మదిలో’ వంటి విజయవంతమైన సినిమాలను నిర్మించారు రాజ్ కందుకూరి. ఇప్పుడు ఆయన కుమారుడు శివ కందుకూరి హీరోగా పరిచయం కాబోతున్నారు. శేష సింధురావు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ‘చూసీ చూడంగానే...’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. రాజ్ కందుకూరి నిర్మించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ‘‘ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. సెప్టెంబర్‌లో సినిమా విడుదల చేద్దామనుకుంటున్నాం. సురేశ్‌గారి బ్యానర్‌తో కలసి ఈ సినిమా విడుదల చేస్తాం. ‘96’ ఫేమ్ వర్ష బొల్లమ్మ ఇందులో హీరోయిన్‌గా నటించారు’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్, కెమెరా: వేద రామన్.
Comments
Please login to add a commentAdd a comment