
శివ కందుకూరి హీరోగా పి19 ఎంటర్‌టైన్ మెంట్ పతాకంపై వ్యాపారవేత్త సురేష్ రెడ్డి కొవ్వూరి ఓ సినిమా నిర్మించనున్నారు. ఈ సినిమా ద్వారా చవన్ ప్రసాద్‌ను దర్శకుడిగా పరిచయం చేయనున్నారు. జూన్‌లో చిత్రీకరణ ప్రారంభం కానుంది. సురేష్ రెడ్డి కొవ్వూరి మాట్లాడుతూ– ‘‘శివ కందుకూరి పాత్ర సినిమా మెయిన్ పిల్లర్స్‌లో ఒకటి. నటనకు అవకాశం ఉన్న పాత్రలో అతను కనిపిస్తారు. సీతారామ్ ప్రసాద్ మంచి కథ చెప్పారు. దానికి చవన్ ప్రసాద్ న్యాయం చేయగలుగుతారని దర్శకుడిగా పరిచయం చేస్తున్నాం. జూన్‌లో హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్ ఆరంభిస్తాం. కొడైకెనాల్‌లో మరో షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాం’’ అని అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సిద్ధం మనోహర్, కూర్పు: గ్యారీ బీహెచ్, సంగీతం: శ్రీ చరణ్ పాకాల, సహ నిర్మాత: నభిషేక్.
Comments
Please login to add a commentAdd a comment