పల్లెటూరి ప్రేమకథ | Raja Varu Rani Garu pre release event | Sakshi
Sakshi News home page

పల్లెటూరి ప్రేమకథ

Nov 29 2019 12:33 AM | Updated on Nov 29 2019 12:33 AM

Raja Varu Rani Garu pre release event - Sakshi

కిరణ్‌ అబ్బవరమ్, రహస్యగోరక్‌

‘‘పల్లెటూరి ప్రేమకథతో ‘రాజావారు రాణిగారు’ చిత్రం రూపొందింది. ఏ సినిమాకైనా కంటెంటే కింగ్‌. ఈ సినిమా కథ బాగుందనిపిస్తోంది’’ అన్నారు నిర్మాత రాజ్‌ కందుకూరి. కిరణ్‌ అబ్బవరమ్, రహస్యగోరక్‌ జంటగా రవికిరణ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాజావారు రాణిగారు’. డి. మనోవికాస్‌ నిర్మించిన ఈ చిత్రం సురేష్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై నేడు విడుదలవుతోంది.

ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకలో నిర్మాతలు రాజ్‌ కందుకూరి, ‘మధుర’ శ్రీధర్‌ పాటలు విడుదల చేశారు. హీరో విశ్వక్‌సేన్, డైరెక్టర్‌ తరుణ్‌ భాస్కర్‌ బిVŠ æసీడీని లాంచ్‌ చేశారు. ‘‘చిన్న పల్లెటూరులో జరిగే ప్రేమకథ ఇది’’ అన్నారు రవికిరణ్‌. ‘‘సినిమా బాగా వచ్చింది’’ అన్నారు ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ వెంకట్‌సిద్ధారెడ్డి. ‘‘నా తల్లిదండ్రులు ఈ సినిమా తీయడానికి ప్రోత్సహించారు’’ అన్నారు మనోవికాస్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement