మహి, మోనా
మహి రాథోడ్ హీరోగా నటిస్తూ, పీవీయమ్ జ్యోతి ఆర్ట్స్ పతాకంపై నిర్మిస్తోన్న చిత్రం ‘1992’. శివ పాలమూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్ లోగో, ఒక పాటను నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘1992’ టైటిల్, ఫస్ట్ సింగిల్ చాలా ఆసక్తిగా ఉన్నాయి. కొత్త వారిని ప్రోత్సహించడానికి నేనెప్పుడూ ముందుంటాను. కొత్త వారు చేస్తోన్న ఈ ప్రయత్నం విజయం సాధించాలి’’ అన్నారు. శివ పాలమూరి మాట్లాడుతూ–‘‘దర్శకుడిగా నా తొలి చిత్రమిది. నేటి సమాజంలో ప్రేమ, పెళ్లిళ్లు ఎలా తయారయ్యాయో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. మా సినిమా చివరి షెడ్యూల్ జరుగుతోంది. వేసవిలో సినిమా విడుదలకి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ‘‘శివగారు సినిమాను అనుకున్న విధంగా తెరకెక్కి స్తున్నారు’’ అన్నారు హీరో, నిర్మాత మహి రాథోడ్. ‘‘యాత్ర’ సినిమా తర్వాత మంచి పాత్రలు వస్తున్నాయి. ‘1992’లో హీరోయిన్ తండ్రి పాత్రలో నటిస్తున్నా. ఒక అమాయక కుర్రాడు ప్రేమించి, పెళ్లి చేసుకుని ఆ తర్వాత ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? అనేది చిత్ర కథ’’ అన్నారు నటుడు ‘దిల్’ రమేష్. ‘‘తెలుగులో నాకిది తొలి చిత్రం. మంచి పాత్ర చేస్తున్నా’’ అన్నారు మోనా ఠాగూర్.
Comments
Please login to add a commentAdd a comment