
అయిదు నిమిషాలకో దెయ్యం!
కనుమూర్తి భార్గవి ప్రధాన పాత్ర పోషించిన చిత్రం ‘లైఫ్ ఆఫ్టర్ డెత్’. శశి, వెంకట భరద్వాజరెడ్డిలతో కలిసి స్వీయ దర్శకత్వంలో గంగాధర్ రాజరపు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 13న విడుదల కానున్న ఈ చిత్రం ప్రచార చిత్రాలను హైదరాబాద్‌లో మల్టీ డైమన్షన్ వాసు, రాజ్ కందుకూరి, ‘మధురా’ శ్రీధర్‌ల చేతుల మీదుగా విడుదల చేశారు. ‘‘స్టడీకామ్ కెమెరాతో... ఇంట్లో ఉండే మామూలు లైట్లు వేసి ఈ సినిమా తీశాను. ఈ సినిమాలో ప్రతి అయిదు నిముషాలకూ ఒక దెయ్యం వస్తుంది’’ అని దర్శకుడు చెప్పారు.