
‘‘యాక్టింగ్ చేయగల టాలెంట్ నాలో ఉందా? లేదా అని సందేహం ఉండేది. నా కాలేజ్ ఫైనల్ ఇయర్‌లో థియేటర్స్ కోర్స్ తీసుకున్నాను. నాలో యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి అని అప్పుడే తెలిసింది. యాక్టర్ అవ్వాలని నిర్ణయించుకున్నాను’’ అని శివ కందుకూరి అన్నారు. శివ కందుకూరిని హీరోగా పరిచయం చేస్తూ ఆయన తండ్రి రాజ్ కందుకూరి నిర్మించిన చిత్రం ‘చూసీ చూడంగానే’. శేష సింధు దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 31న విడుదల కానుంది. ఈ సందర్భంగా శివ కందుకూరి చెప్పిన విశేషాలు.
►నేను సినిమాల్లోకి వస్తాను అని మా నాన్నగారితో చెప్పినప్పుడు ‘‘సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉండే ఇండస్ట్రీ ఇది. ఫైటర్ లాంటి ప్యాషన్ ఉంటే తప్ప నిలబడలేవు. టాలెంట్ ఉన్నా సక్సెస్ వస్తుంది అని చెప్పలేం. నిరంతరం కష్టపడుతూనే ఉండాలి’ అన్నారు.
►ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే... సినిమాలోని పాత్రలన్నీ నిజ జీవితంలో మనకు తెలిసిన పాత్రల్లానే ఉంటాయి. ప్రతి ఒక్కరూ తప్పకుండా కనెక్ట్ అవుతారు. నిర్మాత కొడుకు అని కాకుండా ఈ సినిమాకు కావాల్సిందే చేశారు. కథే హీరో.. ఆ తర్వాతే ఎవ్వరైనా అని నమ్మే స్టయిల్ మా నాన్నగారిది. ఈ కథ నాకోసం తయారు చేయించింది కాదు. ఈ కథ ఓకే అయ్యాకే నేను ఓకే అయ్యాను.
►ఈ తరహా సినిమాలే చేయాలి అని రూల్స్ ఏం పెట్టుకోలేదు. కథ బావుంటే కచ్చితంగా అందులో భాగం అవ్వాలి అనుకుంటాను. మొదటి సినిమా విడుదల కాకముందే మరో రెండు సినిమాలకు అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. వాళ్లు నన్ను నమ్మి చాన్స్ ఇవ్వడం నా అదృష్టం. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను.
Comments
Please login to add a commentAdd a comment