new entry
-
నమ్మకాన్ని నిలబెట్టుకుంటా
‘‘యాక్టింగ్ చేయగల టాలెంట్ నాలో ఉందా? లేదా అని సందేహం ఉండేది. నా కాలేజ్ ఫైనల్ ఇయర్లో థియేటర్స్ కోర్స్ తీసుకున్నాను. నాలో యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి అని అప్పుడే తెలిసింది. యాక్టర్ అవ్వాలని నిర్ణయించుకున్నాను’’ అని శివ కందుకూరి అన్నారు. శివ కందుకూరిని హీరోగా పరిచయం చేస్తూ ఆయన తండ్రి రాజ్ కందుకూరి నిర్మించిన చిత్రం ‘చూసీ చూడంగానే’. శేష సింధు దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 31న విడుదల కానుంది. ఈ సందర్భంగా శివ కందుకూరి చెప్పిన విశేషాలు. ►నేను సినిమాల్లోకి వస్తాను అని మా నాన్నగారితో చెప్పినప్పుడు ‘‘సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉండే ఇండస్ట్రీ ఇది. ఫైటర్ లాంటి ప్యాషన్ ఉంటే తప్ప నిలబడలేవు. టాలెంట్ ఉన్నా సక్సెస్ వస్తుంది అని చెప్పలేం. నిరంతరం కష్టపడుతూనే ఉండాలి’ అన్నారు. ►ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే... సినిమాలోని పాత్రలన్నీ నిజ జీవితంలో మనకు తెలిసిన పాత్రల్లానే ఉంటాయి. ప్రతి ఒక్కరూ తప్పకుండా కనెక్ట్ అవుతారు. నిర్మాత కొడుకు అని కాకుండా ఈ సినిమాకు కావాల్సిందే చేశారు. కథే హీరో.. ఆ తర్వాతే ఎవ్వరైనా అని నమ్మే స్టయిల్ మా నాన్నగారిది. ఈ కథ నాకోసం తయారు చేయించింది కాదు. ఈ కథ ఓకే అయ్యాకే నేను ఓకే అయ్యాను. ►ఈ తరహా సినిమాలే చేయాలి అని రూల్స్ ఏం పెట్టుకోలేదు. కథ బావుంటే కచ్చితంగా అందులో భాగం అవ్వాలి అనుకుంటాను. మొదటి సినిమా విడుదల కాకముందే మరో రెండు సినిమాలకు అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. వాళ్లు నన్ను నమ్మి చాన్స్ ఇవ్వడం నా అదృష్టం. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. -
బిగ్‌బాస్-2.. ఎవరీ నందిని?
బిగ్‌బాస్-2 హౌజ్‌లోకి కొత్త ఎంట్రీ. ఎలిమినేట్ అయిన సంజన స్థానంలో నందిని రాయ్ హౌజ్‌లోకి రానున్నారు. ఇప్పటికే ఆమె ఎంట్రీకి సంబంధించిన ప్రోమోను నిర్వాహకులు వదిలారు. తాజాగా ఆమెకు సంబంధించిన ఓ ఏవీని రిలీజ్ చేశారు. 27 ఏళ్ల నందిని రాయ్. పుట్టింది.. పెరిగింది... హైదరాబాద్‌లోనే. ఉన్నత చదువులు విదేశాల్లో అభ్యసించారు. మోడల్‌గా కెరీర్ ప్రారంభించి తక్కువ టైంలోనే అంతర్జాతీయ మోడలింగ్‌గా పేరు సంపాదించుకున్నారు. 2009లో మిస్ హైదరాబాద్ కిరీటం దక్కించుకున్నారు. 2010లో మిస్ ఆంధ్రప్రదేశ్ విన్నర్ కూడా. తెలుగుతోపాటు ఓ తమిళ్, కన్నడ, మళయాళం చిత్రంలో ఆమె నటించారు. హిందీలో ఫ్యామిలీ ప్యాక్ చిత్రంతో సినిమాల్లోకి అడుగుపెట్టారు. తెలుగులో హర్మోన్స్, మాయా, మోసగాళ్లకు మోసగాడు తదితర చిత్రాల్లో నటించినట్లు చెబుతున్నారు. దివంగత నటి సౌందర్య ఇన్సిపిరేషన్‌తో సినిమాల్లోకి వచ్చారంట. అమ్మాయిలంటే ధృడ సంకల్పంతో ఉండాలని, బిగ్‌బాస్ సీజన్-2లో తాను గెలిచి తీరతానన్న ధీమాతో ఆమె ఉన్నారు. మరి హౌజ్‌లో పరిస్థితులను ఆమె ఏమేర తట్టుకుంటారో చూడాలి. -
వెయ్యి పింఛన్లు ఆపేశారు
ప్రొద్దుటూరు :జిల్లా వ్యాప్తంగా ఆదివారం నుంచి కొత్త పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. కొత్త పింఛన్లు ఇవ్వకపోవడంతో దరఖాస్తుదారుల్లో ఆందోళన నెలకొంది. ఏప్రిల్ నెలకు పింఛన్లు మంజూరు అవుతాయా కావా అన్న అనుమానాలు ఓవై పు ఉంటే, మరో వైపు మళ్లీ జాబితా తయారు చేస్తే తమ పేర్లు ఉంటాయో ఉండవోనని దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో ఎక్కడా ఇలాంటి పరిస్థితి లేదని అధికారులు చెప్పుకుంటున్నారు. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి 2వేల పింఛన్లు మంజూరు చేయడంతోపాటు ఈనెల 1 నుంచి పింఛన్‌దారులకు డబ్బుపంపిణీ చేస్తున్నారు. ఈ ప్రకారం జిల్లాకు 20వేల వృద్ధాప్య, దివ్యాంగుల, వితంతు, చేనేత పింఛన్లు మంజూరు కాగా ఇందులో ప్రొద్దుటూరు నియోజకవర్గానికి 2వేలు మంజూరయ్యాయి. వీటిలో ప్రొద్దుటూరు, రాజుపాళెం మండలాలకు 1000 పింఛన్లు, మిగతా 1000 పింఛన్లు ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి కేటాయించారు. జన్మభూమి కమిటీ సభ్యులు ఇచ్చిన లేఖల ఆధారంగా మున్సిపల్ అధికారులు సంతకం చేసిన జాబితాను ప్రభుత్వానికి పంపారు. మున్సిపల్ అధికారులు పంపిన జాబితా లో తాము సూచించిన పేర్లు లేవని, పింఛ న్ల జాబితాను నిలిపివేయాలని అధికార పార్టీ నేతలు స్వయంగా జిల్లా కలెక్టర్‌ను కలిశారు. దీంతో ప్రొద్దుటూరులో పింఛన్ల పంపిణీ ఆగిపోయింది. 1000 మందికి కలిపి రూ.11లక్షలు మంజూరైంది. గతంలోనూ ఇలాగే జరిగింది గత ఏడాది ఆఖరులో మున్సిపాలిటీ పరిధిలోని 77 మంది చేనేత కార్మికులకు పింఛన్లు మంజూరయ్యాయి. ఈ జాబితాకు సంబంధించిన డబ్బు కూడా మంజూరైంది. అయితే తమకు తెలియకుండా పింఛన్లు మంజూరు చేశారని అధికార పార్టీ నేతలు పింఛన్లు పంపిణీ చేయకుండా నిలిపివేశారు. ఆ సమయంలో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి వారం రోజుల పాటు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. చివరికి జిల్లా అ«ధికారులు జో క్యం చేసుకుని చేనేత కార్మికులకు పింఛన్లు మంజూరు చేశారు. ఆ సమయంలో అప్రతిష్టను మూటకట్టుకున్న అధికార పార్టీ నేతలు మరో మారు ఈ విధంగా చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇలా జరిగింది మున్సిపాలిటీకి 1000 పింఛన్లు మంజూరు కావడంతో అధికార పార్టీ నేతలు తమ ఇష్టానుసారం పింఛన్లను వార్డులకు కేటా యించారు. అయిన వారికి ఆకుల్లో, కాని వారికి కంచాల్లో అన్న చందంగా పింఛన్లు మంజూరు చేశారు. ఓ వార్డుకు వంద వరకు పింఛన్లు మంజూరు కాగా మరికొన్ని వార్డులకు 20 కూడా లేవు. ఇక్కడ అధికార పార్టీ నేతలు వివక్ష ప్రదర్శించారు. త్వరలో వస్తాయి మున్సిపాలిటీ పరిధిలో 1000 పింఛన్లకు సంబంధించిన జాబితా తయారు చేసి మున్సిపల్ అధికారులకు ఇచ్చాం. అయితే ఇక్కడి నుంచి రెండు జాబితాలు వెళ్లాయి. ఈ కారణంగా తమ జాబితా ప్రకారం పింఛన్లు మంజూరు చేయాలని చెప్పాం. పింఛన్లు ఆగిపోయాయని హంగామా చేస్తున్నారు. కలెక్టర్ రెండు మూడు రోజుల్లో మంజూరు చేస్తారు. – ఆసం రఘురామిరెడ్డి, మున్సిపల్ చైర్మన్, ప్రొద్దుటూరు -
వాళ్లు చనిపోయినా...
లాస్ ఏంజిల్స్ : ఏనుగు చచ్చినా...బతికినా ఒకటే విలువ అని తెలుగులో ఓ నానుడి. తాజా ఫోర్బ్స్ చనిపోయిన సెల్రబిటీ ధనవంతుల లిస్టు చూస్తే ఈ సామెత గుర్తు రాక మానదు. చనిపోయి తర్వాత కూడా కొంతమంది సెలబ్రిటీలు ఫోర్బ్స్ ధనవంతుల లిస్టులో చేరారు. తాజాగా ఆ జాబితాలో ఇపుడు హాలీవుడ్ స్టార్, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ హీరో పాల్ వాకర్ చేరాడు. ఫోర్బ్స్ డెడ్ సెలబ్రిటీల లిస్ట్‌లో కొత్తగా చోటు సంపాదించి తొమ్మిదో స్థానంలో ఆక్రమించాడు. ఇప్పుడతను గడిచిన ఏడాది పాల్ వాకర్ పది మిలియన్ డాలర్లు ఆర్జించాడు. అటు పాప్ సంగీత రారాజు, మైఖేల్ జాక్సన్ వరుసగా మూడోసారి టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. ఆ తర్వాత స్థానాల్లో ఎల్విస్ ప్రెస్లీ, ఛార్లెస్ ష్కల్జ్, బాబ్ మార్లే, ఎలిజబెత్ టేలర్ 5వ స్థానంలో కొనసాగుతుండగా, మార్లిన్ మాన్రో, జాన్ లెన్నాన్, ఆల్బర్ట్ ఐన్ స్టీన్ తదితరులు తరువాతి స్థానాలను ఆక్రమించారు. కాగా రెండేళ్ల క్రితం అంటే 2013లో హై స్పీడ్ కారు ప్రమాదంలో పాల్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ అనూహ్య పరిణామంతో ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ అభిమానులు విషాదంలో మునిగిపోయారు.