ముచ్చటైన ప్రేమ | Gamanam Movie First Look Release | Sakshi
Sakshi News home page

ముచ్చటైన ప్రేమ

Published Tue, Oct 6 2020 12:57 AM | Last Updated on Tue, Oct 6 2020 12:57 AM

Gamanam Movie First Look Release - Sakshi

శివ కందుకూరి, ప్రియాంకా జవాల్కర్‌ జంటగా నటించిన ప్యాన్‌ ఇండియా చిత్రం ‘గమనం’. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సుజనారావు దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. రమేశ్‌ కరుటూరి, వెంకీ పుషడపులతో కలిసి జ్ఞానశేఖర్‌ నిర్మిస్తూ, కెమెరామెన్‌గా చేస్తున్నారు. ఈ చిత్రంలో శివ కందుకూరి చేసిన అలీ, ప్రియాంకా జవాల్కర్‌ చేసిన జారా పాత్రల ఫస్ట్‌లుక్‌ను సోమవారం విడుదల చేసింది చిత్రబృందం. శివ వైట్‌ జెర్సీలో క్రీడాకారునిగా కనిపిస్తుండగా, జారా పాత్రలో  ప్రియాంక సంప్రదాయమైన దుస్తుల్లో ముస్లిమ్‌ అమ్మాయిలా కనిపిస్తోంది. ఈ ఇద్దరి మధ్య సాగే క్యూట్‌ లవ్‌స్టోరీ చూడముచ్చటగా ఉంటుందని చిత్రబృందం పేర్కొంది. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో కీలక పాత్రలు చేస్తున్న నిత్యామీనన్, శ్రియ ఫస్ట్‌ లుక్స్‌ని కొన్ని రోజుల క్రితం విడుదల చేశారు. ఆ లుక్స్‌కి మంచి స్పందన లభించింది. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటోంది.  సాయిమాధవ్‌ బుర్రా రచయితగా చేసిన ఈ చిత్రానికి మ్యూజిక్‌ మేస్ట్రో ఇళయరాజా సంగీతాన్ని సమకూర్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement