Bhoothaddam Bhaskar Narayana Trailer: హత్యలు కాదు నరబలి..ట్రైలర్‌ అదిరింది! | Shiva Kandukuri Bhoothaddam Bhaskar Narayana Movie Official Trailer Out, Watch Video Inside - Sakshi
Sakshi News home page

Bhoothaddam Bhaskar Narayana Trailer: హత్యలు కాదు పక్కా ప్లాన్‌తో నరబలి..ట్రైలర్‌ అదిరింది

Published Sat, Feb 10 2024 7:01 PM | Last Updated on Sat, Feb 10 2024 7:34 PM

Bhoothaddam Bhaskar Narayana Trailer Out - Sakshi

శివ కందుకూరి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘భూతద్ధం భాస్కర్‌ నారాయణ’. పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని స్నేహాల్‌, శశిధర్‌, కార్తీక్‌ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌నిమాస్ కా దాస్ విశ్వక్ సేన్ విడుదల చేశారు.. 'ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్ర సరిహద్దు సమీపంలో మునుపెన్నడూ చూడని దారుణ హత్య జరిగింది. ఈ హత్యలని దిష్టి బొమ్మ హత్యలుగా పోలీసులు పేర్కొన్నారు''అనే న్యూస్ బులిటెన్ వాయిస్ మొదలైన ట్రైలర్ ఆద్యంతం  ఆసక్తికరంగా సాగింది.

ఒక్క క్లూ కూడా వదలకుండా హత్యలు చేసే  ఓ సీరియల్ కిల్లర్ కేసుని డిటెక్టివ్ భూతద్ధం భాస్కర్ నారాయణ(శివ కందుకూరి) ఎలా పరిష్కరించాడనేది చాలా థ్రిల్లింగ్ గా  ట్రైలర్ లో ప్రజెంట్ చేశారు. అసలు సీరియల్ కిల్లర్ మనిషా రాక్షసుడా ? అని సస్పెన్స్ ని రేకెత్తిస్తూ ట్రైలర్ చివర్లో వచ్చిన సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ చాలా ఎక్సయిటింగా వున్నాయి. డిటెక్టివ్ భూతద్ధం భాస్కర్ నారాయణ గా శివ కందుకూరి పెర్ఫార్మెన్స్ చాలా ప్రామెసింగా వుంది. దర్శకుడు పురుషోత్తం రాజ్ కథని చాలా ఎంగేజింగ్ గా చెప్పారని ట్రైలర్ చూస్తుంటే అర్ధమౌతుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బ్రిలియంట్ గా వుంది. విజివల్స్, ప్రొడక్షన్ వాల్యుస్ టాప్ క్లాస్ లో వున్నాయి. మొత్తనికి ట్రైలర్ సినిమాని చాలా క్యురియాసిటీని పెంచింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement