అప్పుడే ప్రేక్షకుడు థియేటర్‌కి వస్తాడు: ‘శివం భజే’ నిర్మాత | Producer Maheshwar Reddy Talk About Shivam Bhaje Movie | Sakshi
Sakshi News home page

అప్పుడే ప్రేక్షకుడు థియేటర్‌కి వస్తాడు: ‘శివం భజే’ నిర్మాత

Published Tue, Jul 30 2024 5:46 PM | Last Updated on Tue, Jul 30 2024 5:55 PM

Producer Maheshwar Reddy Talk About Shivam Bhaje Movie

‘టికెట్ల రేట్లు తగ్గించినంత మాత్రనా సినిమా చూస్తారనుకోవడం పొరపాటు. కంటెంట్‌లో దమ్ముండాలి. మౌత్‌ టాక్‌ బాగుంటే టికెట్‌ రేట్లు తగ్గించినా..పెంచినా ప్రేక్షకుడు థియేటర్స్‌కి వస్తారు’అని అన్నారు నిర్మాత మహేశ్వర్ రెడ్డి మూలి. ఆయన నిర్మాణ సంస్థలో అశ్విన్ బాబు, దిగంగనా సూర్యవంశీ జంటగా నటించిన చిత్రం‘శివం భజే’. అప్సర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఆగస్ట్‌ 1న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా నిర్మాత మహేశ్వర్‌ రెడ్డి మీడియాతో ముచ్చటించారు.  ఆ విశేషాలు..

శివం భజే కథను ముందుగా నేను విన్నాను. నాకు చాలా నచ్చింది. విన్న వెంటనే అడ్వాన్స్ ఇచ్చాను. ఆ తరువాత ఈ కథను అశ్విన్ దగ్గరకు తీసుకెళ్లాం. ఆయనకు కూడా వెంటనే నచ్చింది. ఐదు నిమిషాల్లోనే ఓకే చెప్పేశారు. అలా ప్రాజెక్ట్ ముందుకు కదిలింది.

హీరో అశ్విన్ బాబు బర్త్ డే సందర్భంగా అని ఏమీ ఈ సినిమాను ఆగస్ట్ 1న రిలీజ్ చేయడం లేదు. మేం ఒక డేట్ అనుకున్నాం.. అది ఆయన బర్త్ డే అయింది. అంతే కానీ మేమేదో కావాలని పుట్టిన రోజు స్పెషల్‌గా రిలీజ్ చేయాలని అయితే ప్లాన్ చేయలేదు.

నేను శివుడి భక్తుడ్ని కాబట్టి..  ఈ సినిమాను తీయలేదు. కథలో ట్విస్టులు బాగా నచ్చాయి. ఇందులో చాలా లేయర్స్ ఉంటాయి. ఇది ఒక జానర్‌కు మాత్రమే పరిమితం అవుతుందని కూడా చెప్పలేను. ఐదారు జానర్లు కలిసి తీసిన సినిమాలా ఉంటుంది. అన్ని రకాల అంశాలుంటాయి. అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. ట్విస్టులను అయితే ఇప్పుడు రివీల్ చేయలేను

శివం భజే చిత్ర విడుదలకు ఇదే సరైన సమయం(ఆగస్ట్‌ 1) అని భావించాను. డిస్ట్రిబ్యూటర్‌గానూ ఆలోచించాను. అందుకే ఈ డేట్‌ను ఫిక్స్ చేశాం. ఇక మున్ముందు పెద్ద సినిమాలు రాబోతోన్నాయి. క్వాలిటీ, కంటెంట్ కోసం అనుకున్న దాని కంటే కాస్త ఎక్కువే బడ్జెట్ పెట్టాను.

మ్యూజిక్ డైరెక్టరే ఈ చిత్రానికి హీరో. అద్భుతమైన పాటలు, ఆర్ఆర్ ఇచ్చారు. ఈ మూవీని హైద్రాబాద్ చుట్టూనే తీశాం. కథ కూడా పూర్తిగా ఇక్కడే తిరుగుతుంది.

ఐఐటీ కృష్ణమూర్తి టీంతో ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నా. కార్తికేయతో ఓ సినిమా ఉంది. శివం భజే హిట్ అయితే ఈ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేస్తాం. ఆల్రెడీ హిందీ డబ్బింగ్ రైట్స్ అయితే అమ్ముడుపోయాయి. ఈ చిత్రం హిట్ అయితే.. రెండో పార్ట్‌ని కూడా ప్లాన్ చేస్తాం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement