అశ్విన్ బాబు యాక్షన్ థ్రిల్లర్.. కొత్త ఏడాదిలో ప్రారంభం..! | Ashwin Babu latest Upcoming Movie In DSR Production | Sakshi
Sakshi News home page

Ashwin Babu: అశ్విన్ బాబు యాక్షన్ థ్రిల్లర్.. కొత్త ఏడాదిలో ప్రారంభం..!

Published Thu, Dec 15 2022 9:31 PM | Last Updated on Thu, Dec 15 2022 9:32 PM

Ashwin Babu latest Upcoming Movie In DSR Production - Sakshi

విభిన్న కథా చిత్రాలను ఎంచుకుంటూ రాజు గారి గది సినిమా సిరీస్‌తో  ఘన విజయాన్ని సాధించిన హీరో అశ్విన్ బాబు. ప్రస్తుతం ఆయన ప్రధాన పాత్రలో యాక్షన్ థ్రిల్లర్‌గా 'హీడింబ'తో మరోసారి తన సత్తా చాటనున్నారు .

దమ్మాలపాటి కృష్ణారావు ఆశీస్సులతో.. శ్రీ శైలేంద్ర సినిమాస్ బ్యానర్‌పై అశ్విన్ బాబుతో కొత్త ఏడాదిలో ప్రముఖ నిర్మాత డీఎస్‌ఆర్  ఓ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. కంటెంట్ ఆధారిత చిత్రాల్లో నటిస్తున్న అశ్విని బాబు  తదుపరి చిత్రం ఒక విభిన్న మైన స్టోరీ లైన్‌తో,మెడికల్ థ్రిల్లర్‌గా రూపొందుతుంది. ఈ చిత్రంతో ఎం.ఆర్.కృష్ణ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. సురేష్ మూవీస్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ సహకారంతో.. మంచి టెక్నికల్ వాల్యూస్‌తో ఉన్న చిత్రాలు నిర్మించనున్నట్లు చిత్ర నిర్మాత డీఎస్‌ఆర్ ప్రకటించారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement