అక్కినేని హీరో నాగచైతన్య(akkineni Naga Chaitanya) ప్రస్తుతం తండేల్ మూవీతో(Thandel Movie) ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. చందు మొండేటి డైరెక్షన్‌లో వస్తోన్న ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇటీవలే వైజాగ్ వేదికగా తండేల్ మూవీ ట్రైలర్‌న కూడా మేకర్స్ రిలీజ్ చేయగా.. ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. మత్స్యకార బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కించిన ఈ చిత్రంలో నేచురల్ బ్యూటీ సాయిపల్లవి హీరోయిన్‌గా నటించింది. సినిమా రిలీజ్‌కు మరో వారం రోజులు మాత్రమే గడువు ఉండడంతో మేకర్స్ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. తాజాగా తండేల్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు.
అయితే ఈ చిత్రాన్ని యధార్థ కథ ఆధారంగా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. మత్స్యకారుల నేపథ్యంలో ఈ మూవీని రూపొందించారు. కొందరు భారత జాలర్లు పాక్ భూభాగంలోకి పొరపాటున వెళ్లడంతో వారందరినీ పాకిస్తాన్ కోస్ట్‌గార్డ్స్ అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో తండేల్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
(ఇది చదవండి: నాగచైతన్య తండేల్ మూవీ.. ఐకాన్ స్టార్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్)
ఈ చిత్రంలో అక్కినేని నాగచైతన్య తండేల్ రాజ్ అనే మత్స్యకారుని పాత్రలో కనిపించనున్నారు. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రియల్ తండేల్ రాజ్(తండేల్ రామారావు) హాజరయ్యారు. తన కుటుంబంతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తనకు కూడా సినిమాలో అవకాశం ఇస్తే బాగుంటుందని తండేల్ రామారావు అన్నారు. తండేల్-2 లోనైనా నాకు ఏదైనా పాత్ర ఇచ్చినా ఫర్వాలేదని ఆయన అన్నారు. దీనికి తండేల్ రాజు భార్య మాట్లాడుతూ.. మీరు మళ్లీ పాకిస్తాన్ వాళ్లకి దొరికితేనే సాధ్యం అంటూ ఫన్నీగా మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
#Thandel Part 2 రావాలంటే.. నువ్వు మళ్ళీ పాకిస్థాన్ కి దొరకాలి 🤣
Real Bujji Talli to Real ThandelRaju pic.twitter.com/z9k2njOxdl— Rajesh Manne (@rajeshmanne1) February 2, 2025
Comments
Please login to add a commentAdd a comment