
మహానంది: రాజుగారి గది–2లో ప్రముఖ హీరో అక్కినేని నాగార్జునతో కలిసి నటించడం అదృష్టంగా భావిస్తున్నానని యువ హీరో అశ్విన్‌బాబు అన్నారు. మహానందీశ్వరుడిని దర్శించుకునేందుకు మిత్రులతో కలిసి సోమవారం ఆయన మహానందికి వచ్చారు. ఈ సందర్భంగా అశ్విన్‌బాబు కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వరస్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన మొదటి చిత్రం జీనియస్ కాగా ఆ తర్వాత రాజుగారి గది, జతకలిసే, నాన్న..నేను నా బాయ్‌ఫ్రెండ్, రాజుగారి గది–2 చిత్రాల్లో నటించానన్నారు. త్వరలో మరో మూడు ప్రాజెక్టులు చేయబోతున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment