సింగిల్‌ క్యారెక్టర్‌తో సినిమా.. రారా పెనిమిటి అంటున్న నందిత శ్వేత | Nandita Swetha Raara Penimiti Pre Release Event | Sakshi
Sakshi News home page

Raara Penimiti: భర్త కోసం భార్య పడే విరహ వేదన.. రారా పెనిమిటి అంటున్న నందిత శ్వేత

Published Sun, Apr 9 2023 6:37 PM | Last Updated on Sun, Apr 9 2023 6:37 PM

Nandita Swetha Raara Penimiti Pre Release Event - Sakshi

భ‌ర్త రాక కోసం..భార్య ప‌డే విర‌హ వేదన నేప‌థ్యంలో సింగిల్ క్యార‌క్ట‌ర్‌తో రూపొందిన చిత్రం `రారా పెనిమిటి`. శ్రీ విజ‌యానంద్ పిక్చ‌ర్స్ బ్యానర్‌లో రూపొందిన ఈ చిత్రంలో ఉన్న ఏకైక పాత్రలో నందిత శ్వేత న‌టించ‌గా స‌త్య వెంక‌ట గెద్దాడ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీతాన్ని స‌మ‌కూర్చగా ప్ర‌మీల గెద్దాడ నిర్మాతగా వ్యవహరించింది.  ఈ సినిమా త్వ‌ర‌లో విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో ప్రీ రిలీజ్ వేడుక ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా సంగీత ద‌ర్శ‌కుడు మ‌ణిశ‌ర్మ మాట్లాడుతూ...``ద‌ర్శ‌కుడు ఒక మంచి క‌థ‌తో వ‌చ్చి క‌లిశారు. నేను ఇంత వ‌ర‌కు చేసిన కంపోజిష‌న్ లో నాకు ఇష్ట‌మైన పాట‌లు ఇందులో ఉన్నాయి`` అన్నారు. హీరోయిన్ నందిత శ్వేత మాట్లాడుతూ...``డైరెక్ట‌ర్ క‌థ చెప్పి...సింగిల్ క్యార‌క్ట‌ర్ అన‌గానే ... ఈ పాత్ర చేయ‌గ‌ల‌నా అని మొద‌ట భ‌య‌ప‌డ్డాను. సాహ‌స‌మే అయినా ఓకే చెప్పాను. ఇలాంటి పాత్ర చేసే అవ‌కాశం వ‌స్తుంద‌ని ఎప్పుడూ అనుకోలేదు. నిజంగా ఈ సినిమా చేయ‌డం నా అదృష్టం. శివ‌శంక‌ర్ మాస్ట‌ర్ గారు కొరియోగ్ర‌ఫీ అద్భుతంగా చేశారు. వారు ఇప్పుడు లేక‌పోవ‌డం బాధాక‌రం`` అన్నారు.

ద‌ర్శ‌కుడు స‌త్య వెంక‌ట గెద్దాడ మాట్లాడుతూ...``కొత్త‌గా పెళ్లైన అమ్మాయి..త‌న భ‌ర్త రాక కోసం ఎద‌రు చూస్తూ ప‌డే విర‌హ వేద‌నే ఈ చిత్రం. త‌న భ‌ర్త వ‌చ్చాడా?  లేదా? అన్న‌ది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. గ్రామీణ నేప‌థ్యంలో న‌డిచే క‌థ కాబ‌ట్టి.. ఆ గ‌డుసుత‌నం ఉన్న అమ్మాయి కావాలని... చాలా మందిని సెర్చ్ చేశాక నందిత గారైతే ప‌ర్ఫెక్ట్ అని తీసుకున్నాం. త‌ను నేను అనుకున్న దానిక‌న్నా అద్భుతంగా చేసింది.

అష్ట ల‌క్ష‌ణాలున్న పాత్ర‌ను చాలా అవలీలగా చేసింది. మ‌ణిశ‌ర్మ గారు ఈ సినిమాకు పని చేయ‌డ‌మే పెద్ద ఎస్సెట్ గా భావిస్తున్నాం. సింగిల్ క్యారక్ట‌ర్ అయినప్ప‌టికీ హీరోయిన్ తో పలు పాత్ర‌లు ఫోన్ లో సంభాషిస్తుంటాయి. ఆ పాత్ర‌ల‌కు బ్రహ్మానందం, త‌ణికెళ్ల భ‌ర‌ణి, సునీల్, స‌ప్త‌గిరి, హేమ‌, అన్న‌పూర్ణమ్మ ఇలా ప‌లువురు న‌టీన‌టులు డ‌బ్బింగ్ చెప్పారు. వారంద‌రికీ నా ధ‌న్య‌వాదాలు. సినిమా అంతా పూర్త‌యింది. త్వ‌ర‌లో విడుద‌ల చేస్తాం`` అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement