ఒకే రోజు రెండు దెయ్యాల విడుదల | ekkadiki pothavu chinnavada, Intlo deyyam nakem bhayyam release on november 11 | Sakshi
Sakshi News home page

ఒకే రోజు రెండు దెయ్యాల విడుదల

Published Wed, Oct 19 2016 9:22 AM | Last Updated on Mon, Sep 4 2017 5:42 PM

ఒకే రోజు రెండు దెయ్యాల విడుదల

ఒకే రోజు రెండు దెయ్యాల విడుదల

ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో హర్రర్ కామెడీల ట్రెండ్ బాగా నడుస్తోంది. ఈ జానర్లో తెరకెక్కిన సినిమాలు మినిమమ్ కలెక్షన్లు సాధిస్తుండటంతో యంగ్ హీరోలు ఈ తరహా సినిమాలు చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ముఖ్యంగా కొత్త దర్శకులు, కొత్త నటీనటులకు హర్రర్ కామెడీలు వరంగా మారాయి. ఇదే బాటలో తెరకెక్కిన రెండు ఇంట్రస్టింగ్ సినిమాలు ఒకేరోజు బాక్సాఫీస్ బరిలో తలపడేందుకు రెడీ అవుతున్నాయి.

చాలా రోజులుగా ఓ మంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న అల్లరి నరేష్ కూడా ఈ సారి హర్రర్ కామెడీనే నమ్ముకున్నాడు. జి నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఇంట్లో దెయ్యం నాకేం భయం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. అదే సమయంలో విఐ ఆనంద్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా తెరకెక్కిన ఎక్కడికి పోతావు చిన్నవాడ హర్రర్ మూవీ కూడా రిలీజ్కు రెడీ అవుతోంది.

ఈ రెండు సినిమాల జానర్ దాదాపుగా ఒకటే కావటంతో పాటు రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్కు రెడీ అవుతున్నాయి. ఇద్దరు హీరోలు ఫ్లాప్లతో కష్టాల్లో ఉండటంతో ఈ సినిమాల సక్సెస్ వారి కెరీర్కు కీలకంగా మారింది.  మరి ఒకేరోజు రిలీజ్ అవుతున్న ఈ రెండు దెయ్యాలలో ఏ దెయ్యాన్ని సక్సెస్ వరిస్తుందో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement