హిట్ కాంబినేషన్‌లో సినిమా షురూ | Naga Chaitanya-Sudheer Varma movie launched | Sakshi
Sakshi News home page

హిట్ కాంబినేషన్‌లో సినిమా షురూ

Published Fri, Jun 13 2014 12:21 AM | Last Updated on Sat, Sep 2 2017 8:42 AM

హిట్ కాంబినేషన్‌లో సినిమా షురూ

హిట్ కాంబినేషన్‌లో సినిమా షురూ

‘మనం’ విజయంతో ఉత్సాహంతో ఉన్న నాగచైతన్య... మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేశారు. ‘స్వామి రారా’ దర్శకుడు సుధీర్‌వర్మ దర్శకత్వంలో బీవీఎస్‌ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కృతీసనన్ కథానాయిక. ఈ చిత్రం ప్రారంభోత్సవం గురువారం హైదరాబాద్‌లో జరిగింది. దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు దృశ్యానికి నాగచైతన్య క్లాప్ ఇచ్చారు. ‘‘సుధీర్‌వర్మ  ‘స్వామిరారా’ సినిమా అంటే నాకెంతో ఇష్టం. ఈ సినిమా స్క్రిప్ట్ కూడా చాలా బాగా వచ్చింది.
 
 నా కెరీర్‌లో మరో భారీ విజయంగా నిలుస్తుంది’’ అని నాగచైతన్య నమ్మకం వెలిబుచ్చారు. నిర్మాత మాట్లాడుతూ -‘‘‘అత్తారింటికి దారేది’ తర్వాత మా సంస్థ నుంచి వస్తున్న సినిమా ఇది. సుధీర్ వర్మ అద్భుతమైన కథ తయారు చేశారు. చైతూకి వందశాతం సరిపోయే కథ ఇది. జూలై 2 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతాం. భారీ నిర్మాణ విలువలతో ఈ చిత్రం ఉంటుంది’’ అని తెలిపారు. ‘‘నాగచైతన్య కోసమే అన్నట్లుగా ఈ కథ కుదిరింది.
 
 అన్ని వర్గాలనూ ఆకట్టుకునే ఈ కథ నా కెరీర్‌కి మంచి మలుపు అవుతుంది. ‘అత్తారింటికి దారేది’ లాంటి ఇండస్ట్రీ హిట్‌ని నిర్మించిన సంస్థలో నా రెండో సినిమా రూపొందడం ఆనందంగా ఉంది’’ అని సుధీర్‌వర్మ అన్నారు. బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, రవిబాబు, రావురమేశ్, ప్రవీణ్, పూజ, సత్య తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సన్ని ఎం.ఆర్, కెమెరా: రిచర్డ్ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సుధీర్ ఈదర, సమర్పణ: భోగవల్లి బాపినీడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement