చిరిగిన జీన్సు వేసుకున్నా..!
‘‘ఆవ్ తుజే మోకోత్తా...’’ అంటూ ‘1 - నేనొక్కడినే’ చిత్రంలో మహేశ్‌ను ఆటపట్టించిన కృతీ సనన్, తాజాగా నాగచైతన్యతో ‘దోచేయ్’లో నటించారు. ‘హీరోపంటి’, ‘1 -నేనొక్కడినే’ చిత్రాలకు భిన్నంగా ఆమె ఈ సినిమాలో టామ్‌బాయ్ తరహా పాత్ర పోషించారు. ఈ పాత్ర గురించి ఆమె చెబుతూ -‘‘నేను ఇందులో మెడికోగా నటించాను. క్లాస్‌లు ఎగ్గొట్టడానికి కాలేజీ గోడదూకి పారిపోయే పాత్ర నాది. ఓ విద్యార్థి ఎలా ఉండకూడదో అలా ఉంటుంది’’ అని చెప్పారామె.
తన గత చిత్రాలకు భిన్నంగా ఈ సినిమాలో కొత్తగా కనిపించడానికి ప్రయత్నించాననీ, దాని కోసం చిరిగిన జీన్స్‌లు కూడా వేసుకున్నాననీ, మొత్తానికి తన వేషధారణ చాలా విచిత్రంగా ఉంటుందనీ ఆమె చెప్పారు. సహ నటుడు నాగచైతన్య గురించి మాట్లాడుతూ, ‘‘చైతూతో పనిచేయడం చాలా సరదాగా ఉంటుంది. అగ్ర తారల కుటుంబం నుంచి వచ్చానన్న భావం అతనిలో కించిత్ కూడా లేదు ’’ అంటూ పొగడ్తల వర్షం కురిపించారు.