దోచేస్తాడు! | Dohchay first look raises expectations on Naga Chaitanya | Sakshi
Sakshi News home page

దోచేస్తాడు!

Published Tue, Feb 17 2015 11:29 PM | Last Updated on Sat, Sep 2 2017 9:29 PM

దోచేస్తాడు!

దోచేస్తాడు!

 అభిమానులను, సినీ ప్రియుల మనసులను దోచేయడానికి  నాగచైతన్య రెడీ అవుతున్నారు. అదేంటీ అనుకుంటున్నారా? మరేం లేదు.. నాగచైతన్య కథానాయకునిగా సుధీర్‌వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి ‘దోచేయ్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. టైటిల్‌కి తగ్గట్టే ప్రేక్షకుల హృదయాలను ఈ చిత్రం దోచేయడం ఖాయమంటున్నారీ చిత్రబృందం. రిలయన్స్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా పతాకంపై బీవీయస్‌యన్ ప్రసాద్ ఈ చిత్రం నిర్మిస్తున్నారు. శివరాత్రి సందర్భంగా మంగళవారం ఈ చిత్రం టైటిల్‌ను ప్రకటించడంతో పాటు, టైటిల్ లోగోను, నాగచైతన్య లుక్‌ను విడుదల చేశారు.
 
  ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ - ‘‘ఈ చిత్రకథకు ‘దోచేయ్’ టైటిల్ వంద శాతం నప్పుతుంది. రెండు పాటలు మినహా సినిమా పూర్తయ్యింది. ‘అత్తారింటికి దారేది’ తర్వాత మా సంస్థ నుంచి రాబోతున్న మరో సూపర్ హిట్ మూవీ ఇది. నాగచైతన్య కెరీర్‌లో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచే చిత్రం అవుతుంది. వచ్చే నెలాఖరున చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. కృతి సనన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, రవిబాబు, రావు రమేష్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం: సన్నీ ఎం.ఆర్, కెమెరా: రిచర్డ్ ప్రసాద్, సహనిర్మాత: భోగవల్లి బాపినీడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement