
దోచేయడానికి రెడీ!
నాగచైతన్య ఈ వేసవికి ప్రేక్షకుల మనసులను దోచేయడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటివరకూ రొమాంటిక్, యాక్షన్ ఎంటర్‌టైనర్లు చేసిన చైతూ తొలిసారిగా ‘దోచేయ్’ పేరుతో క్రైమ్ థ్రిల్లర్ చేశారు. ‘స్వామి రారా’ ఫేమ్ సుధీర్ వర్మ చాలా స్టయిలిష్‌గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. మహేశ్‌తో ‘1’లో నటించిన కృతీ సనన్‌కిది రెండో తెలుగు సినిమా. ‘అత్తారింటికి దారేది’ తర్వాత బీవీయస్‌యన్ ప్రసాద్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఇటీవలే పీటర్ హెయిన్స్ నేతృత్వలో ఓ థ్రిల్లింగ్ ఛేజ్ చిత్రీకరించారు. దాంతో చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 17న విడుదల చేయనున్నామని నిర్మాత వెల్లడించారు. ఈ చిత్రానికి సంగీతం: సన్నీ ఎం ఆర్, కెమెరా: రిచర్డ్ ప్రసాద్, సహనిర్మాత: భోగవల్లి బాపినీడు.