చైతూ, కృతి జోడీ కుదిరింది... | Kriti Sanon to romance Naga Chaitanya | Sakshi
Sakshi News home page

చైతూ, కృతి జోడీ కుదిరింది...

Published Sun, Jun 1 2014 11:17 PM | Last Updated on Sat, Sep 2 2017 8:10 AM

చైతూ, కృతి జోడీ కుదిరింది...

చైతూ, కృతి జోడీ కుదిరింది...

 ‘మనం’తో నాగచైతన్య మంచి జోష్ మీదున్నారు. ‘స్వామి రారా’తో తొలి విజయాన్ని అందుకొని దర్శకుడు సుధీర్‌వర్మ మంచి స్పీడ్ మీదున్నారు. సక్సెస్‌లో ఉన్న వీరిద్దరూ కలిసి ఇప్పుడు ఓ చిత్రం చేస్తున్నారు. ఇండస్ట్రీ హిట్ ‘అత్తారింటికి దారేది’ని ప్రేక్షకులకు అందించిన బీవీఎస్‌ఎన్ ప్రసాద్ ఈ చిత్రానికి నిర్మాత. ఇందులో నాగచైతన్య సరసన కృతి సనన్‌ని కథానాయికగా ఎంపిక చేశారు. మహేశ్‌బాబు హీరోగా నటించిన ‘1’ చిత్రం ద్వారా కథానాయికగా పరిచయమైన కృతి చేయనున్న రెండో సినిమా ఇదే అవుతుంది. ఈ చిత్రం గురించి నాగచైతన్య మాట్లాడుతూ- ‘‘సుధీర్‌వర్మ ‘స్వామి రారా’ నాకు ఎంతో ఇష్టమైన సినిమా. ఆ సినిమా చూడగానే... తనతో ఓ సినిమా చేయాలని నిశ్చయించుకున్నాను. యాదృచ్ఛికంగా తనే ఓ మంచి కథ చెప్పాడు. చాలా బాగా నచ్చింది.
 
 త్వరలోనే సెట్స్‌కి వెళ్లనున్నాం. ‘ఒక లైలా కోసం’ తర్వాత నేను నటించే సినిమా ఇదే అవుతుంది’’ అని చెప్పారు. ‘‘‘అత్తారింటికి దారేది’ తర్వాత చాలా కథలు విన్నాను. సుధీర్‌వర్మ చెప్పిన ఈ కథ అద్భుతం అనిపించింది. చైతూ కోసమే అన్నట్లు ఉందీ కథ. మా సంస్థ నుంచి రానున్న మరో భారీ విజయం ఈ సినిమా. ఈ నెలలోనే సెట్స్‌కి వెళ్తున్నాం’’ అని నిర్మాత తెలిపారు. నాగచైతన్యను డెరైక్ట్ చేయడం, బీవీఎస్‌ఎన్ ప్రసాద్ సంస్థలో రెండో సినిమా చేయడం ఆనందంగా ఉందని, ఈ చిత్రం తన కెరీర్‌కి పెద్ద బ్రేక్ అవుతుందని దర్శకుడు నమ్మకం వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి సంగీతం: సన్నీ ఎం.ఆర్, కెమెరా: రిచర్డ్ ప్రసాద్, కూర్పు: కార్తీక్ శ్రీనివాస్, సమర్పణ: భోగవల్లి బాపినీడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement