చైతూ జోడీ సమంత కాదా? | Rakul Preet to romance Naga Chaitanya | Sakshi
Sakshi News home page

చైతూ జోడీ సమంత కాదా?

Published Fri, Jul 15 2016 12:32 AM | Last Updated on Tue, Jul 23 2019 11:50 AM

Rakul Preet to romance Naga Chaitanya

టాలీవుడ్‌లో రకుల్ ప్రీత్‌సింగ్ స్టార్ డమ్‌కు ఇప్పట్లో ఢోకా లేనట్లే. అనుకున్న అవకాశాలతో పాటు.. అనుకోని ఆఫర్లూ ఈ బ్యూటీని వెతుక్కుంటూ వస్తున్నాయి. మహేష్‌బాబు హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రంలో రకుల్ నాయికగా ఎంపికయ్యారనే వార్త వచ్చిన విషయం తెలిసిందే.
 
 ఈ విషయాన్ని గురువారం మురుగదాస్ ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. ఇదిలా ఉంటే నాగచైతన్య కొత్త సినిమాలోనూ రకుల్ ప్రీత్ సింగ్‌నే హీరోయిన్‌గా తీసుకున్నారట! సమంత ఈ సినిమాలో నాయికగా ఉంటుందని ముందు అనుకున్నా... ఇప్పుడు నిర్ణయం మార్చుకున్నారని సమాచారం.
 
 ఈ మధ్య సమంత, నాగచైతన్య మధ్య రిలేషన్ ఎక్కువగా వార్తల్లో ఉండటమే సమంతను ప్రాజెక్ట్ నుంచి తప్పించడానికి కారణమా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ‘సోగ్గాడే చిన్ని నాయన’ ఫేం కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కథతో తెరకెక్కనున్న ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ నిర్మించనుంది. ఆగస్టు మొదటి వారంలో షూటింగ్ ప్రారంభం కాబోతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement