Sudhir Verma
-
రావణాసుర షురూ
రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రావణాసుర’ షురూ అయింది. సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్, ఆర్టీ టీమ్ వర్క్స్ బ్యానర్స్‌పై అభిషేక్ నామా నిర్మిస్తున్న ఈ సినిమా శుక్రవారం భోగి సందర్భంగా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. రవితేజపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కెమెరా స్విచ్చాన్ చేయగా, నటుడు చిరంజీవి క్లాప్ ఇచ్చారు. దర్శకులు కేయస్ రవీంద్ర (బాబీ), గోపీచంద్ మలినేని గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకుడు కె. రాఘవేంద్ర రావు స్క్రిప్ట్‌ని యూనిట్‌కి అందించారు. ఈ సందర్భంగా ‘రావణాసుర’ పోస్టర్‌ను చిరంజీవి విడుదల చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్ 30న సినిమాను విడుదల చేయనున్నట్లు పోస్టర్లో పేర్కొంది చిత్రబృందం. ‘‘యాక్షన్ థ్రిల్లర్‌గా ‘రావణాసుర’ రూపొందనుంది. ఈ నెలలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం’’ అని అభిషేక్ నామా అన్నారు. సుశాంత్ కీలక పాత్ర చేస్తున్న ఈ సినిమాలో అనూ ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాశ్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగార్కర్, పూజిత పొన్నాడ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: హర్షవర్థన్ రామేశ్వర్, భీమ్స్, కెమెరా: విజయ్ కార్తీక్ కన్నన్, సీఈఓ: పోతిని వాసు. -
మళ్లీ కథ మొదటికొచ్చింది!
ఏ కథ అనడిగితే... రెండు కథలున్నాయి. రెండూ మొదటికొచ్చాయి! మొదటిది... సినిమా కథ! రెండోది... హీరో రవితేజ, దర్శకుడు సుధీర్‌వర్మల కాంబినేషన్ సెట్ అవుతుందా? లేదా? అనే కథ. ‘స్వామి రారా’ సక్సెస్‌తో సుధీర్వర్మపై స్టార్ హీరోల కన్ను పడింది. స్వతహాగా యువ దర్శకులను ఎంకరేజ్ చేసే రవితేజ ఈ దర్శకుణ్ణి పిలిచి మాంచి కథ ఉంటే చెప్పమని అడిగారు. ‘దోచేయ్’ తర్వాత సుధీర్‌వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేయాలనుకున్నారు రవితేజ. కొన్నాళ్లు డిస్కషన్స్ కూడా జరిగాయి. కానీ, ఎందుకో ప్రాజెక్ట్ సెట్ కాలేదు. మళ్లీ రవితేజ–సుధీర్‌వర్మల మధ్య డిస్కషన్స్ జరుగుతున్నాయని ఫిల్మ్‌నగర్ టాక్. రీసెంట్ హిట్ ‘కేశవ’తో సక్సెస్ జోష్‌లో ఉన్న సుధీర్‌వర్మ... రవితేజ కోసం సరికొత్త కథ సిద్ధం చేస్తున్నారట! ప్రస్తుతం రవితేజ ‘టచ్ చేసి చూడు, రాజా ది గ్రేట్’ సినిమాలు చేస్తున్నారు. ఆ రెండిటి తర్వాత సుధీర్‌వర్మ సినిమా స్టార్ట్ చేసే ఛాన్సుంది! -
ఎవరిపై పగ?
‘స్వామి రారా’తో తెలుగులో మళ్లీ క్రైమ్ కామెడీ సినిమాలకు కొత్త ఊపిరి అందించిన హీరో నిఖిల్, దర్శకుడు సుధీర్ వర్మ కలయికలో అభిషేక్ పిక్చర్స్ ప్రొడక్షన్ నిర్మిస్తున్న సినిమా హైదరాబాద్‌లోని సంస్థ కార్యాలయంలో ప్రారంభమైంది. దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి చిత్రనిర్మాత అభిషేక్ నామా క్లాప్ ఇవ్వగా, నామా మధుసూదన రావు కెమేరా స్విచాన్ చేశారు. ‘‘పగ, ప్రతీకారాల నేపథ్యంలో సాగే చిత్రమిది. ఈ రివెంజ్ డ్రామాలో ప్రేమకథ ఆసక్తికరంగా ఉంటుంది. చిత్రీకరణ అంతా కాకినాడ టు విశాఖ తీరప్రాంతంలోనే జరుగుతుంది’’ అని సుధీర్‌వర్మ తెలిపారు. ‘‘సెప్టెంబర్ 19న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం’’ అన్నారు నిర్మాత. ఇందులో రీతూ వర్మ హీరోయిన్. -
సరికొత్త తెలుగు సినిమా ఇది..! - నాగచైతన్య
‘‘ఆరు నెలల క్రితం సుధీర్ వర్మ ఈ సినిమా కథ చెప్పినప్పుడు చాలా బావుందనిపించింది. ఈ సినిమా కచ్చితంగా మంచి విజయం సాధిస్తుంది’’ అని నాగార్జున అన్నారు. నాగచైతన్య, కృతీ సనన్ జంటగా శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన చిత్రం ‘దోచేయ్’. సుధీర్‌వర్మ దర్శకుడు. సన్నీ స్వరాలందించిన ఈ సినిమా పాటల వేడుక శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లో జరిగింది. ఆడియో సీడీని నాగార్జున ఆవిష్కరించి కీరవాణికి అందజేశారు. ఈ సందర్భంగా కీరవాణి మాట్లాడుతూ, ‘‘సన్నీ చాలా మంచి సంగీతం ఇచ్చాడు. మేధావులు మాత్రమే మేజర్ స్కేల్లో పాటలు ఇస్తారు. సన్నీ ఈ సినిమాలో చేసిందదే. ‘స్వామి రారా’ లో సుధీర్ వర్మ పనితనం నాకు బాగా నచ్చింది’’ అని చెప్పారు. నాగచైతన్య మాట్లాడుతూ, ‘‘సరికొత్త తెలుగు సినిమా ఇది. సుధీర్ వర్మ చాలా బాగా తీశాడు. కచ్చితంగా మంచి విజయం సాధిస్తుంది’’ అన్నారు. సుధీర్ వర్మ మాట్లాడుతూ, ‘‘ ఈ సినిమా చేయడానికి నాకు సపోర్ట్ చేసిన నిర్మాతలకు, హీరో చైతూకు నా థ్యాంక్స్. సన్నీ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు’’ అని అన్నారు. బ్రహ్మానందం మాట్లాడుతూ, ‘‘ఈ సినిమాలో సినిమా హీరోగా నటించాను. చాలా వెరైటీగా కామెడీ చేయించాడు దర్శకుడు సుధీర్. చైతన్య ఎప్పుడూ తనకు నచ్చే, నప్పే పాత్రలను ఎంచుకుంటూ వరుసగా సినిమాలు చేస్తున్నారు. కచ్చితంగా ఈ చిత్రాన్ని అందరికీ నచ్చే సినిమా అవుతుంది’’ అని అన్నారు. ‘‘దర్శకునికి తాను తీయాలనుకున్న సినిమా గురించి, కథ గురించి క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ నాకు ‘స్వామి రారా’ సినిమా చూశాక సుధీర్‌లో ఉందనిపించింది. ఈ సినిమాలో పాజిటివ్ లుక్ కనిపిస్తోంది’’ అని దర్శకుడు రాజమౌళి అన్నారు. ఈ వేడుకలో హీరోయిన్ కృతీ సనన్, పోసాని కృష్ణమురళి, దర్శకులు సుకుమార్, చందు మొండేటి, నటులు రాజా రవీంద్ర, రవివర్మ, తదితరులు పాల్గొన్నారు. -
చైతూ, కృతి జోడీ కుదిరింది...
‘మనం’తో నాగచైతన్య మంచి జోష్ మీదున్నారు. ‘స్వామి రారా’తో తొలి విజయాన్ని అందుకొని దర్శకుడు సుధీర్‌వర్మ మంచి స్పీడ్ మీదున్నారు. సక్సెస్‌లో ఉన్న వీరిద్దరూ కలిసి ఇప్పుడు ఓ చిత్రం చేస్తున్నారు. ఇండస్ట్రీ హిట్ ‘అత్తారింటికి దారేది’ని ప్రేక్షకులకు అందించిన బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రానికి నిర్మాత. ఇందులో నాగచైతన్య సరసన కృతి సనన్ని కథానాయికగా ఎంపిక చేశారు. మహేశ్‌బాబు హీరోగా నటించిన ‘1’ చిత్రం ద్వారా కథానాయికగా పరిచయమైన కృతి చేయనున్న రెండో సినిమా ఇదే అవుతుంది. ఈ చిత్రం గురించి నాగచైతన్య మాట్లాడుతూ- ‘‘సుధీర్‌వర్మ ‘స్వామి రారా’ నాకు ఎంతో ఇష్టమైన సినిమా. ఆ సినిమా చూడగానే... తనతో ఓ సినిమా చేయాలని నిశ్చయించుకున్నాను. యాదృచ్ఛికంగా తనే ఓ మంచి కథ చెప్పాడు. చాలా బాగా నచ్చింది. త్వరలోనే సెట్స్‌కి వెళ్లనున్నాం. ‘ఒక లైలా కోసం’ తర్వాత నేను నటించే సినిమా ఇదే అవుతుంది’’ అని చెప్పారు. ‘‘‘అత్తారింటికి దారేది’ తర్వాత చాలా కథలు విన్నాను. సుధీర్‌వర్మ చెప్పిన ఈ కథ అద్భుతం అనిపించింది. చైతూ కోసమే అన్నట్లు ఉందీ కథ. మా సంస్థ నుంచి రానున్న మరో భారీ విజయం ఈ సినిమా. ఈ నెలలోనే సెట్స్‌కి వెళ్తున్నాం’’ అని నిర్మాత తెలిపారు. నాగచైతన్యను డెరైక్ట్ చేయడం, బీవీఎస్ఎన్ ప్రసాద్ సంస్థలో రెండో సినిమా చేయడం ఆనందంగా ఉందని, ఈ చిత్రం తన కెరీర్‌కి పెద్ద బ్రేక్ అవుతుందని దర్శకుడు నమ్మకం వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి సంగీతం: సన్నీ ఎం.ఆర్, కెమెరా: రిచర్డ్ ప్రసాద్, కూర్పు: కార్తీక్ శ్రీనివాస్, సమర్పణ: భోగవల్లి బాపినీడు.