మళ్లీ కథ మొదటికొచ్చింది! | Ravi Teja Sudhir Verma's new movie? | Sakshi
Sakshi News home page

మళ్లీ కథ మొదటికొచ్చింది!

Published Mon, Jun 12 2017 12:38 AM | Last Updated on Tue, Sep 5 2017 1:22 PM

మళ్లీ కథ మొదటికొచ్చింది!

మళ్లీ కథ మొదటికొచ్చింది!

ఏ కథ అనడిగితే... రెండు కథలున్నాయి. రెండూ మొదటికొచ్చాయి! మొదటిది... సినిమా కథ! రెండోది... హీరో రవితేజ, దర్శకుడు సుధీర్‌వర్మల కాంబినేషన్‌ సెట్‌ అవుతుందా? లేదా? అనే కథ. ‘స్వామి రారా’ సక్సెస్‌తో సుధీర్‌వర్మపై స్టార్‌ హీరోల కన్ను పడింది. స్వతహాగా యువ దర్శకులను ఎంకరేజ్‌ చేసే రవితేజ ఈ దర్శకుణ్ణి పిలిచి మాంచి కథ ఉంటే చెప్పమని అడిగారు.

‘దోచేయ్‌’ తర్వాత సుధీర్‌వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేయాలనుకున్నారు రవితేజ. కొన్నాళ్లు డిస్కషన్స్‌ కూడా జరిగాయి. కానీ, ఎందుకో ప్రాజెక్ట్‌ సెట్‌ కాలేదు. మళ్లీ రవితేజ–సుధీర్‌వర్మల మధ్య డిస్కషన్స్‌ జరుగుతున్నాయని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. రీసెంట్‌ హిట్‌ ‘కేశవ’తో సక్సెస్‌ జోష్‌లో ఉన్న సుధీర్‌వర్మ... రవితేజ కోసం సరికొత్త కథ సిద్ధం చేస్తున్నారట! ప్రస్తుతం రవితేజ ‘టచ్‌ చేసి చూడు, రాజా ది గ్రేట్‌’ సినిమాలు చేస్తున్నారు. ఆ రెండిటి తర్వాత సుధీర్‌వర్మ సినిమా స్టార్ట్‌ చేసే ఛాన్సుంది!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement