
Naga Chaitanya To Romance Rashmika Mandanna: టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 13 ఏళ్లు కావోస్తుంది. 2009లో 'జోష్' చిత్రంతో అక్కినేని నాగార్జున నట వారసుడిగా పరిచయమైన చైతూ ఇటీవల థ్యాంక్యూ మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అలాగే హిందీలో డెబ్యూ ఇస్తూ తన మార్కెట్ పెంచుకునే దిశగా వెళ్తున్నాడు చైతూ. నాగ చైతన్య తాజాగా నటించిన చిత్రం 'లాల్ సింగ్ చద్దా'. అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో చైతూ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఆగస్టు 11న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నాడు.
ఇదిలా ఉంటే నాగ చైతన్యకు సంబంధించిన ఒక కొత్త వార్త చక్కర్లు కొడుతోంది. నాగ చైతన్య హీరోగా పరశురామ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయిన ఈ మూవీ త్వరలోనే సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నాట. ఈ చిత్రంలో హీరోయిన్ కోసం వెతుకులాట మొదలు పెట్టిన దర్శకనిర్మాతలు నేషనల్ క్రష్ రష్మిక మందన్నాను తీసుకోనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే, రష్మికకు డైరెక్టర్ పరశురామ్ కథ వినిపించారా? లేదా? అన్నది స్పష్టత లేదు. ఒకవేళ ఇది ఓకే అయితే నాగ చైతన్య, రష్మిక మందన్నా తొలిసారిగా జోడి కట్టిన చిత్రం ఇదే అవుతుంది. కాగా పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన 'గీత గోవిందం'లో రష్మిక హీరోయిన్‌గా చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment