Naga Chaitanya Comments on Director Parasuram - Sakshi
Sakshi News home page

Naga Chaitany‍a: ఆయన గురించి మాట్లాడటం టైం వేస్ట్: నాగచైతన్య

Published Sun, May 7 2023 10:56 AM | Last Updated on Sun, May 7 2023 11:17 AM

Naga Chaitanya Comments On Director parasuram  - Sakshi

నాగచైతన్య, కృతిశెట్టి జంటగా నటించిన తాజా చిత్రం 'కస్టడీ'. శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాసా పొట్లూరి నిర్మించిన ఈ ద్విభాషా (తమిళం, తెలుగు) చిత్రానికి వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహించారు. ఇళయరాజా, యువన్‌ శంకర్‌ రాజా కలిసి సంగీతాన్ని అందించిన ఇందులో అరవింద్‌స్వామి, శరత్‌కుమార్‌, ప్రియమణి ముఖ్యపాత్రలు పోషించారు.

ఇప్పటికే నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్న చైతూ తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఓ డైరెక్టర్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

(ఇది చదవండి: నాగచైతన్యతో నటించడం మంచి ఎక్స్‌పీరియన్స్‌: కృతిశెట్టి)

గతంలో నాగచైతన్యతో డైరెక్టర్ పరశురాం సినిమా చేస్తున్నారని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబుతో ‘సర్కారు వారి పాట’ సినిమాకు ఛాన్స్ రావడంతో నాగ చైతన్య ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టేసినట్లు సమాచారం. తాజా ఇంటర్వ్యూలో దీనిపై ప్రశ్నించగా.. 'ఆయన గురించి మాట్లాడటం టైం వేస్ట్. నా టైం వేస్ట్ చేశారు. ఆయన గురించి మాట్లాడటం మన టైం వేస్ట్‌.' అంటూ సమాధానమిచ్చారు. 

(ఇది చదవండి: అవే మనల్ని దూరం చేశాయి.. సమంత ఇంట్రెస్టింగ్‌ పోస్ట్‌)

అయితే ఆ సినిమా తరువాత మళ్లీ చైతూ దగ్గరకు పరశురాం వెళ్లారని.. నాగేశ్వరరావు అనే టైటిల్‌తో సినిమాను పట్టాలెక్కిస్తున్నారని టాక్ వినిపించింది. కానీ కథ నాగచైతన్యకు నచ్చకపోవడంతో సినిమా రద్దు చేసుకున్నారని వార్తలొచ్చాయి. దీంతో ప్రస్తుతం నాగచైతన్య చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement