
నాగ చైతన్య, రష్మికా మందన్నా
నాగచైతన్య హీరోగా ‘గీతగోవిందం’ ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. 14 రీల్స్ ప్లస్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమాకు ‘నాగేశ్వరరావు’ అనే టైటిల్ అనుకుంటున్నారని, ఆ టైటిల్ రోల్‌నే నాగచైతన్య చేస్తారని వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ సినిమాలో కథానాయికగా రష్మికా మందన్నా నటించబోతున్నారనే వార్త షికారు చేస్తోంది. పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన ‘గీతగోవిందం’ చిత్రంలో గీతగా రష్మిక నటించిన సంగతి గుర్తుండే ఉంటుంది. ‘గీతగోవిందం’ చిత్రం రష్మికా కెరీర్‌కు మంచి మైలేజ్‌ని ఇచ్చింది. మరి.. స్క్రీన్‌పై నాగచైతన్యతో రష్మికా జోడీగా కనిపిస్తుందా? వెయిట్ అండ్ సీ.
Comments
Please login to add a commentAdd a comment