ప్రయోగాలకు రెడీ! | Naga Chaitanya Goes Back To Gautham Menon? | Sakshi
Sakshi News home page

ప్రయోగాలకు రెడీ!

Published Wed, Apr 29 2015 12:15 AM | Last Updated on Sun, Sep 3 2017 1:02 AM

ప్రయోగాలకు రెడీ!

ప్రయోగాలకు రెడీ!

‘‘ప్రయోగాలనేవి రిస్కుగా అనిపిస్తాయి కానీ, వాటివల్లే మనకంటూ ఓ గుర్తింపు వస్తుంది. అప్పట్లో నాన్నగారు కూడా ఎన్నో ప్రయోగాలు చేశారు. నేను కూడా ఆయనలాగానే ప్రయోగాలకు రెడీ’’ అంటున్నారు నాగ చైతన్య. సుధీర్ వర్మ దర్శకత్వంలో బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మాణంలో ఆయన నటించిన ‘దోచేయ్’ ఇటీవలే విడుదలైంది. ఈ సినిమా తనకు విభిన్నమైన గుర్తింపు తీసుకువచ్చిందని నాగ చైతన్య మంగళవారం హైదరాబాద్‌లో పత్రికలవారితో చెప్పారు.
 
 ఈ సందర్భంగా నాగ చైతన్య మాట్లాడుతూ -‘‘నాన్నగారు సినిమా చూసి బాగా ఎంజాయ్ చేశారు. నా లుక్, గెటప్ స్టయిలిష్‌గా ఉందని మెచ్చుకున్నారు. పోసాని కృష్ణమురళి, బ్రహ్మానందాల కామెడీ ఈ సినిమాకు ప్లస్. ఛేజింగ్, యాక్షన్ సన్నివేశాలు బాగా కష్టపడి చేశాను’’ అని చెప్పారు. అఖిల్ పరిచయ చిత్రంలో అతిథి పాత్రపోషణ చేస్తున్నట్టు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. చందు మొండేటి దర్శకత్వంలో ఓ సినిమా స్క్రిప్టు దశలో ఉందనీ, గౌతమ్ మీనన్‌తో ఓ చిత్రం చేయడానికి చర్చలు జరుగుతున్నాయనీ ఈ సందర్భంగా నాగ చైతన్య వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement