చైతూతో తమిళ సినిమా తీస్తా! | introduce to naga chaithanya in tamil industry :Gautham Menon | Sakshi
Sakshi News home page

చైతూతో తమిళ సినిమా తీస్తా!

Published Tue, Nov 15 2016 10:45 PM | Last Updated on Mon, Sep 4 2017 8:10 PM

చైతూతో తమిళ సినిమా తీస్తా!

చైతూతో తమిళ సినిమా తీస్తా!

‘‘చైతూ (నాగచైతన్య)కి తమిళ్ బాగా వచ్చు. మంచి పర్సనాలిటీ ఉన్న హీరో. అతణ్ణి తమిళ సినీపరిశ్రమకి నేనే పరిచయం చేస్తా. చైతూ హీరోగా తమిళ సినిమా తీస్తా’’ అన్నారు గౌతమ్ మీనన్. నాగచైతన్య, మంజిమా మోహన్ జంటగా ఆయన దర్శకత్వంలో మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మించిన ‘సాహసం శ్వాసగా సాగిపో’ ఈ నెల 11న విడుదలైంది. గౌతమ్ మీనన్ మాట్లాడుతూ - ‘‘ఈ సినిమాతో చైతూ మాస్ హీరోగా కూడా ఎదిగాడు. ‘ఏ మాయ చేసావె’కీ, ఇప్పటికీ నటుడిగా ఎంతో పరిణతి చెందాడు.

రవీందర్‌రెడ్డి చాలా తపన ఉన్న నిర్మాత. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందనతో హ్యాపీగా ఉన్నా. ‘మంచి లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్’ అంటూ ఎంజాయ్ చేస్తున్నారు. నోట్ల మార్పిడి ప్రభావం కొంత ఉన్నప్పటికీ, వసూళ్లు బాగున్నాయి. ప్రస్తుతం ధనుష్ హీరోగా నేను చేస్తున్న సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇది కాకుండా.. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నా. తెలుగు వెర్షన్‌కి హీరోగా చైతూని అనుకున్నా. దీంతో పాటు విక్రమ్‌తో మరో సినిమా కూడా చర్చల దశలో ఉంది’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement