
గన్స్‌తో డీల్ చేసే గ్యాంగ్‌స్టర్ అయినా ప్రేమగాలి సోకితే గులాబీ పట్టాల్సిందే. అమ్మాయిని ఫాలో అవ్వాల్సిందే. అలా ప్రేమలో పడ్డ ఓ గ్యాంగ్‌స్టర్ తన లవ్‌ని ఎలా డీల్ చేశాడనే అంశాన్ని వెండితెరపై చూసే టైమ్ దగ్గర్లోనే ఉంది. శర్వానంద్ హీరోగా సుధీర్‌వర్మ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాలో కాజల్ అగర్వాల్, కల్యాణీ ప్రియదర్శన్ కథానాయికలు. పీడీవీ ప్రసాద్, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ స్పెయిన్‌లో జరుగుతోంది. ఈ షెడ్యూల్ మార్చి 1 వరకు సాగుతుందని సమాచారం. ఇందులో యంగ్‌స్టర్‌గా, మిడిల్ ఏజ్డ్ గ్యాంగ్‌స్టర్‌గా శర్వా డ్యూయల్ రోల్ చేస్తున్నారని టాక్. ఈ సినిమా వర్కింగ్ స్టిల్స్ నెట్టింట్లో లీక్ అయ్యాయి. దీంతో శర్వా లుక్ బయటకు వచ్చింది. గ్యాంగ్‌స్టర్ రోల్ కోసం గుబురు గడ్డంతో శర్వా అల్ట్రా స్టైలిష్‌గా కనిపించబోతున్నారని లీకైన ఫొటోలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment