దోచేస్తా... | Naga Chaitanya Sudheer Varma film titled Docheyi | Sakshi
Sakshi News home page

దోచేస్తా...

Published Tue, Dec 9 2014 11:33 PM | Last Updated on Sat, Sep 2 2017 5:54 PM

దోచేస్తా...

దోచేస్తా...

 నాగచైతన్య తాజా చిత్రానికి ‘దోచేస్తా’ అనే టైటిల్ అనుకుంటున్నారట. టైటిల్ ఖరారు కాకముందే.. ఈ చిత్రం టీజర్ బయటకొచ్చేసింది. ఆ టీజర్‌లో టైటిల్ ఖరారు కాలేదంటూ... బ్రహ్మానందం సెటైర్లు కూడా విసిరారు. ఇటీవలే ఈ టైటిల్‌ని ఫిలింఛాంబర్‌లో రిజిస్టర్ చేసినట్లు వినికిడి. ‘స్వామి రారా’ ఫేం సుధీర్‌వర్మ దర్శకత్వంలో బీవీఎస్‌ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. థ్రిల్లర్ కామెడీ, లవ్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో మోసగాళ్లను మోసం చేసే ఘరానా మోసగాడిగా నాగచైతన్య కనిపించనున్నట్లు తెలిసింది. షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చిన ఈ చిత్రాన్ని జనవరి చివరి వారంలో విడుదల చేసే అవకాశం ఉందని యూనిట్ వర్గాల భోగట్టా. ‘1’ ఫేం కృతీ సనన్ నాయిక.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement