bvsn pradad
-
‘గాంఢీవధారి అర్జున’ టీజర్ వచ్చేస్తుంది
వరుణ్ తేజ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘గాంఢీవధారి అర్జున’. ఈ చిత్రంలో సాక్షీ వైద్య హీరోయిన్గా నటించారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో బీవీఎస్ఎన్ ప్రసాద్, బాపినీడు నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 25న విడుదల కానుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ సినిమా టీజర్‌ను ఈ నెల 24న రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించి, కొత్త పోస్టర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు వరుణ్ తేజ్. ఇందులో అర్జున్ అనే సెక్యూరిటీ ఆఫీసర్‌గా వరుణ్ తేజ్ నటించారని, ఓ విపత్తు నుంచి ప్రజలను రక్షించేందుకు అర్జున్ ఎటువంటి సాహసాలు చేశాడు? అనేది ఈ చిత్రం ప్రధానాంశమని సమాచారం. -
‘నో పెళ్లి..’ సాంగ్ పెద్ద సౌండ్‌తో పెడతా..
‘‘ఈ లాక్డౌన్ ఒక్కసారి ఆగి, నన్ను నేను తెలుసుకోవడానికి ఉపయోగపడింది. మా ఇంటి చుట్టూ ఎన్ని రకాల పక్షులు సందడి చేస్తాయో ఈ లాక్‌డౌన్‌లోనే గమనించాను. బిజీ లైఫ్‌లో ఎంత గందరగోళంగా బతుకుతున్నానో నాకప్పుడు అర్థం అయ్యింది’’ అన్నారు సాయి తేజ్. సుబ్బు దర్శకత్వంలో సాయితేజ్, నభా నటేశ్ జంటగా బీవియస్‌ఎన్ ప్రసాద్ నిర్మించిన ‘సోలో బ్రతుకే సో బెటర్’ రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా సాయితేజ్ చెప్పిన విశేషాలు. ► కరోనా లాక్డౌన్ తర్వాత విడుదలవుతున్న పెద్ద తెలుగు సినిమా మీదే! కరోనా భయంతో ప్రేక్షకులు థియేటర్‌కు వస్తారంటారా? సాయితేజ్: సినిమా ప్రేమికులు కచ్చితంగా వస్తారు. ఎందుకంటే సినిమాను థియేటర్లో చూసే ఎక్స్‌పీరియన్స్‌ను ఇన్ని రోజులు మిస్సయ్యాం. థియేటర్‌కి వచ్చే ప్రేక్షకులకి ధైర్యం నింపటం కోసం ‘టెనెట్’ సినిమా విడుదలవ్వగానే నేను థియేటర్లో చూశాను. నా తోటి హీరోలు, దర్శకులు చాలామంది థియేటర్‌కి వెళ్లి, సినిమాను థియేటర్లోనే చూడమని మోటివేట్ చేశారు. వాస్తవానికి ఈ సినిమా మొదట మే1న విడుదల చేద్దామనుకున్నాం. కరోనా కారణంగా వాయిదా వేశాం. ► ‘సోలో బ్రతుకే సో బెటర్’ అని సినిమాలో ఎందుకంటున్నారు? కాలేజీలో చదివే ఒక యంగ్ బోయ్ తన ఫ్రెండ్స్‌కి సోలో లైఫ్ వల్ల లాభాలేంటని చెప్పే సినిమా ఇది. ఫ్రెష్‌గా కాలేజీ నుండి బయటకు వచ్చేవాళ్లను హీరో ఎలా ఇన్స్పైర్ చేశాడనేది సినిమా. ఆ క్రమంలో అతను ఎలాంటి కష్టాలను ఎదుర్కొన్నాడు? వాటినుండి ఎలా బయటపడ్డాడు అనేది కథ. యూత్‌ఫుల్ సబ్జెక్ట్ అయినప్పటికీ ఫ్యామిలీ యాంగిల్‌ని ఎమోషనల్‌గా బాగా తెరకెక్కించాడు దర్శకుడు. ప్రతి ఫ్యామిలీకి ఈ సినిమా కనెక్ట్ అవుతుంది. ► ఈ సినిమా మీ జీవితానికి ఏమైనా దగ్గరగా ఉందా? ఈ సినిమానే కాదు.. గతంలో చేసిన ‘చిత్రలహరి’,‘ ప్రతిరోజూ పండగే’ సినిమాలను కూడా నా లైఫ్‌కి ఎంతో దగ్గరగా ఫీలయ్యాను. ఈ సినిమా అయితే మరీ దగ్గరగా ఉంటుంది. కారణం బ్యాచ్‌లర్‌ని కావటమే. సోలోగా ఉండాలని మనం ఎలా కోరుకుంటామో, పిల్లలకు పెళ్లి కావాలని పెద్దవాళ్లూ అంతే గట్టిగా కోరుకుంటారు. ఫైనల్‌గా వాళ్లే గెలుస్తారు. మా ఇంట్లో రోజూ సుప్రభాతం తర్వాత ‘నో పెళ్లి..’ సాంగ్ పెద్ద సౌండ్‌తో పెడతాను. ఆ టైమ్‌లో మా అమ్మని కాఫీ అడిగితే నా వైపు ఓ చూపు చూసి ‘నువ్వే పెట్టుకో’ అంటుంది (నవ్వుతూ). ► పిల్లలకు పెళ్లవ్వాలని పెద్దవాళ్లు బలంగా కోరుకుంటారని అన్నారు.. మరి.. మీ పెళ్లెప్పుడు? పెళ్లి చేసుకుంటే ‘ఇంటికి ఎప్పుడొస్తావ్? ఎక్కడున్నావ్? ఏం చేస్తున్నావ్?’ అనే ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పాలి. అదే సోలోగా ఉంటే, మహా అయితే అమ్మ ఫోన్ చేసి ‘తిన్నావా?’ అని ఒకసారి అడుగుతుంది. ‘తిన్నానమ్మా’ అంటే మళ్లీ ఫోన్ రాదు. మా అమ్మ కోసం, ఇంట్లో వాళ్ల కోసం పెళ్లికి ఓకే అన్నా. కానీ 2020లో షూటింగ్‌లకు గ్యాప్ రావటం వల్ల చేయాల్సిన సినిమాలు చాలా ఉన్నాయి. కమిట్ అయిన సినిమాలు అవ్వగానే చూడాలి. ► లాక్డౌన్ ఏమైనా నేర్పించిందా? ఓర్పు, సహనంతో పాటు కృతజ్ఞత అనేది ఎంత ముఖ్యమో తెలుసుకున్నాను. మనం ఒక ప్లాన్‌లో ఉంటే దేవుడు ఇంకోటి చేస్తాడు. దానికి తగ్గట్టు మనం ఎలా నడుచుకోవాలి? మనల్ని మనం ఎలా కరెక్ట్ చేసుకోవాలి అనేది నేర్చుకున్నాను. వాటర్ బాటిల్స్ పట్టడం ఎంత కష్టమో లాక్డౌన్ బాగానే నేర్పించింది (నవ్వుతూ). ► కరోనా సమయంలో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు వచ్చాయి. వాటివల్ల సినిమా పరిశ్రమకు నష్టమా? కరోనాతో నష్టపోయిన సినిమా పరిశ్రమ ఇప్పట్లో కోలుకుంటుంది అనుకుంటున్నారా? ఇండస్ట్రీ డబుల్ స్పీడ్‌లో రికవర్ అవుతుందని నా నమ్మకం. ఎన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు వచ్చినా థియేటర్ ఎక్స్పీరియన్స్ వేరు. అలాగే ఇప్పుడు సినిమాలు చేసేవారు ఎంతో బాధ్యతతో చేస్తారు. ప్రొడక్షన్ వేల్యూస్‌ను పెంచుకుంటూ నటీనటుల దగ్గర నుండి వంద శాతం నటనను రాబట్టుకొని సినిమాలు చేస్తారు. మనకు ఎప్పుడైతే కాంపిటీషన్ ఉంటుందో అప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని పని చేస్తాం. పోటీ మంచిదే. ► కొత్త సంవత్సరం సందర్భంగా మీరు తీసుకునే నిర్ణయాల గురించి..? 2020లో నేర్చుకున్న విషయాలను అమలు చేయాలనుకుంటున్నాను. పరిగెడుతున్న కాలం ఒక్కసారిగా ఆగిపోయినా ధైర్యం కోల్పోకుండా ఎలా ఉండాలో నేర్చుకున్నాను. జీవితం ఆగిపోయిందే అనుకోకుండా దమ్ముగా, ధీటుగా ముందుకెళ్లాలి. మనతోపాటు ప్రకృతి బతకాలి. ఈ భూమ్మీద పుట్టిన ప్రతి ప్రాణి పొల్యూషన్ లేకుండా బతకడానికి అవకాశం ఇవ్వాలి. మన పర్యావరణాన్ని మనం కాపాడుకోవాలనేది నా నూతన సంవత్సరం రిజల్యూషన్ అనుకోవచ్చు. -
యూత్‌ఫుల్ ఎంటర్ టైనర్
‘కబాలి’ ఫేమ్ సాయి ధన్సిక ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న చిత్రానికి బుధవారం కొబ్బరికాయ కొట్టారు. ఈ చిత్రంతో హరి కొలగాని దర్శకుడిగా పరిచయమవుతున్నారు. శ్రీ సాయి లక్ష్మీ క్రియేష¯Œ ్స పతాకంపై పి.యస్.ఆర్ కుమార్ (వైజాగ్ బాబ్జి) నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభం అయ్యింది. తొలి సన్నివేశానికి నిర్మాత బి.వి.యస్. ఎన్. ప్రసాద్ కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకుడు వీవీ వినాయక్ క్లాప్ ఇచ్చారు. నిర్మాత ‘దిల్’ రాజు తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. పి.ఎస్.ఆర్ కుమార్ (వైజాగ్ బాబ్జి) మాట్లాడుతూ–‘‘డిస్ట్రిబ్యూటర్‌గా తెలుగు సినిమా పరిశ్రమతో నాకు చాలా అనుబంధం ఉంది. నేను నిర్మాతగా మారడంలో బెక్కం వేణుగోపాల్ ప్రోత్సాహం ఎంతో ఉంది’’ అన్నారు. ‘‘శబ్దాలయా, అన్నపూర్ణ సంస్థలలో డైరెక్షన్ డిపార్ట్ మెంట్లో పనిచేశాను. యూత్‌ఫుల్ ఎంటర్ టైనర్‌గా రూపొందనున్న చిత్రమిది. ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ నేటి నుంచి ప్రారంభమై ఇరవై రోజుల పాటు హైదరాబాద్‌లో జరుగుతుంది’’ అన్నారు హరి కొలగాని. ‘‘ఈ సినిమాలో కొత్తగా కనిపిస్తాను’’ అన్నారు సాయి ధన్సిక. ఈ చిత్రానికి సమర్పణ: వాగేశ్వరి (పద్మ), కెమెరా: వాస్లి శ్యాం ప్రసాద్, సంగీతం: శేఖర్ చంద్ర, సహ నిర్మాతలు: పవన్, సుమన్, లైన్ ప్రొడ్యూసర్: వెంకట యస్‌కె కులపాక. -
కొత్త జోడీ
ఇండస్ట్రీలోకి వచ్చి పదిహేనేళ్లు అవుతున్నా కెరీర్లో కాజల్ అగర్వాల్ జోరు, క్రేజు ఏ మాత్రం తగ్గడం లేదు. ఆల్రెడీ కమల్‌హాసన్ ‘ఇండియన్ 2’ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు కాజల్. ఇటీవల రవితేజ హీరోగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కనకదుర్గ’ (వర్కింగ్ టైటిల్ అని తెలిసింది) సినిమాలో కాజల్ ఒక కథానాయికగా ఎంపిక అయ్యారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా గోపీచంద్ సరసన ఓ సినిమా చేయబోతున్నట్లు తెలిసింది. గోపీచంద్ హీరోగా బిన్ను సుబ్రహ్మణ్యం దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. బీవీఎస్ఎన్. ప్రసాద్ నిర్మిస్తారు. ఇటీవల ఈ చిత్రం పూజా కార్యక్రమాలు జరిగాయి. ఇందులో కథానాయికగా కాజల్‌ను తీసుకునే ఆలోచనలో చిత్రబృందం ఉందట. ఇప్పటివరకూ గోపీచంద్. కాజల్ కలసి నటించలేదు. మరి ఈ కొత్త జోడీ షురూ అయిందా అనేది తెలియడానికి కొన్ని రోజులు పడుతుంది. ఇక హిందీ హిట్ ‘క్వీన్’ తమిళ రీమేక్ ‘ప్యారిస్ ప్యారిస్’, అలాగే తేజ దర్శకత్వంలో రూపొందిన ‘సీత’ కాజల్ అగర్వాల్ నెక్ట్స్ రిలీజ్లు. ‘సీత’లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించారు. -
హిట్ గ్యారంటీ.. డౌట్ లేదు
‘‘మిస్టర్ మజ్ను’ సినిమా చాలా బాగా వచ్చింది. గ్యారంటీగా మంచి హిట్ అవుతుంది. అందులో ఏ మాత్రం డౌట్ లేదు. జనరల్‌గా హీరోలు.. హీరోయిన్స్‌ని బాగా చూసుకుంటారు. కానీ, అఖిల్ మాత్రం నన్ను బాగా చూసుకున్నాడు (నవ్వుతూ). సాంకేతిక నిపుణులందరూ చాలా బాగా పని చేశారు. ప్రేక్షకులు మా సినిమా చూసి, ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అని నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ అన్నారు. అఖిల్, నిధీ అగర్వాల్ జంటగా ‘తొలిప్రేమ’ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మిస్టర్ మజ్ను’. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పీ పతాకంపై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్మీట్లో వెంకీ అట్లూరి మాట్లాడుతూ– ‘‘తొలిప్రేమ’ సినిమా కంటే ముందే ‘మిస్టర్ మజ్ను’ కథ రాసి, నిర్మాత ‘దిల్’ రాజుగారికి వినిపించా. ‘బలమైన ఎమోషన్స్ ఉన్న కథ ఇది.. అనుభవం ఉన్న దర్శకుడైతే చక్కగా తీయగలడు. ఓ ఏడాది నాతో ట్రావెల్ చెయ్. కొంచెం అనుభవం వస్తుంది, ఆ తర్వాత చేద్దాం’ అన్నారు. ఆ ప్రయాణంలో ఉన్నప్పుడే ‘తొలిప్రేమ’ కథ రాసి, రాజుగారికి వినిపించా. బాగుంది.. ‘ఈ సినిమా తర్వాత ‘మిస్టర్ మజ్ను’ తీస్తే మంచి స్పాన్ ఉంటుంది’ అన్నారు. 2011–2012లో ఈ కథ రాశా. టైటిల్ ‘మిస్టర్ మజ్ను’ అని, సినిమా ఏఎన్ఆర్గారి వారసులతోనే చేయాలని ఫిక్స్ అయ్యా. ఈ కథకి అఖిల్ చక్కగా న్యాయం చేయగలడనే నమ్మకం కుదిరింది. తనకు కథ చెప్పగానే ఓకే అన్నాడు. ఇందులో అఖిల్‌ది ప్లేబోయ్ పాత్ర కాదు. 20నిమిషాలు నాటీ పాత్ర ఉంటుంది. ఆ తర్వాత అంతా లవ్‌స్టోరీ, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ఉంటుంది. మా సినిమా చూసి నవ్వుతారు, ఏడుస్తారు, ఆలోచిస్తారు. ‘తొలిప్రేమ’ కంటే మంచి పాటలివ్వాలని తమన్ నాకంటే బాగా కష్టపడ్డారు’’ అన్నారు. అఖిల్ మాట్లాడుతూ– ‘‘నేను ఇలాంటి సినిమా చేసినందుకు నాన్నగారు (నాగార్జున) చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ సినిమా మా ఫ్యామిలీకి తగ్గ జోనర్. మంచి ప్రొడక్ట్ ఇస్తున్నామనే నమ్మకంతో ప్రతిరోజూ షూటింగ్‌కి ఎంతో ఉత్సాహంగా వెళ్లేవాణ్ని’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన ప్రసాద్ సార్‌కి, వెంకీకి థ్యాంక్స్. అఖిల్ మంచి సహనటుడు. ఈ చిత్రంలోని పాత్రకు బాగా కనెక్ట్ అయ్యి చేశా’’ అన్నారు నిధీ అగర్వాల్. -
మనవడో... వారసుడో...
‘దేవదాసు మనవడో... మన్మథుడి వారసుడో..’ అంటూ అఖిల్ పాత్రను పరిచయం చేస్తూ ఆయన కొత్త సినిమా ఫస్ట్ లుక్ వీడియోను రిలీజ్ చేసింది చిత్రబృందం. అఖిల్ హీరోగా ‘తొలిప్రేమ’ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మిస్టర్ మజ్ను’. నిధీ అగర్వాల్ కథానాయిక. బీవీయస్ఎన్ ప్రసాద్ నిర్మాత. ఈరోజు ఏయన్నార్ జయంతి సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్‌ను రిలీజ్ చేశారు. ‘ఏయన్ఆర్ 8’ అనే బండి నంబర్ ఉండే కారులో అఖిల్‌ను చూపించడం, ‘హలో మిస్... ఏంటో ఈ ఇంగ్లీష్ భాష దేన్నైతే మిస్ చేసుకోకూడదో దాన్నే మిస్ అని పిలుస్తారు’ అనే డైలాగ్ హైలైట్‌గా ఉంది. ఫస్ట్ లుక్ వీడియోను బట్టి ఈ చిత్రంలో అఖిల్ ప్లేబాయ్ క్యారెక్టర్ పోషిస్తున్నారని ఊహించవచ్చు. ‘‘అఖిల్ తాతగారు నాగేశ్వరారవు ‘లైలా మజ్ను’గా, తండ్రి నాగార్జునగారు ‘మజ్ను’గా నటించారు. ఇప్పుడు అఖిల్ ‘మజ్ను’గా అలరించడానికి రెడీ అయ్యారు. లుక్స్, స్టైల్, నటనతో అందర్నీ ఆకట్టుకుంటాడు. ఈ చిత్రాన్ని డిసెంబర్లో రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: తమన్. సాహిత్యం: శ్రీమణి, కెమెరా: జార్జ్ సి. విలియమ్స్. -
హలో.. ఛలో
‘ఛలో’తో టాలీవుడ్‌కి హలో చెప్పారు కన్నడ బ్యూటీ రష్మికా మండన్నా. ఈ సినిమాతో తెలుగు ఆడియన్స్‌ను ఆమె బాగా ఆకట్టుకున్నారు. దాంతో వరుస ఆఫర్స్ కొట్టేస్తున్నారు రష్మిక. ప్రస్తుతం నాగార్జున – నాని మల్టీస్టార్‌లో, విజయ్ దేవరకొండతో ఒక సినిమాలో యాక్ట్ చేస్తున్నారామె. ఇప్పుడు అఖిల్‌కు రష్మికా హలో చెబుతున్నారట. అర్థం కావడంలేదా? ‘తొలిప్రేమ’ ఫేమ్ వెంకీ అట్లూరి డైరెక్షన్లో అఖిల్ ఓ సినిమాలో యాక్ట్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ లవ్‌స్టోరీలో అఖిల్ సరసన హీరోయిన్గా రష్మికా మండన్నాను చిత్రబృందం ఎంపిక చేసిందని సమాచారం. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీయస్‌యన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా సంగీతం: తమన్. -
ఎంతో ప్రేమగా..!
ఎన్టీఆర్‌కు 25వ సినిమా ‘నాన్నకు ప్రేమతో..’. ఇప్పటివరకూ ఆయన నటించిన 24 చిత్రాల్లోని లుక్స్‌కి పూర్తి భిన్నంగా, చాలా స్టయిలిష్‌గా ఎన్టీఆర్ కనిపించడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సుకుమార్ దర్శకత్వంలో రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో బీవీయస్‌యన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ దసరా కానుకగా విడుదల కానుంది. ఇటీవల లండన్‌లో భారీ షెడ్యూల్ జరిపామనీ, తదుపరి షెడ్యూల్‌ను అక్టోబర్ 20న మొదలుపెడతామని బీవీయస్‌యన్ ప్రసాద్ తెలిపారు. స్పెయిన్‌లో జరిగే ఈ షెడ్యూల్‌తో సినిమా పూర్తవుతుందనీ, సంక్రాంతికి చిత్రాన్ని విడుదల చేస్తామని చెప్పారు. ఎన్టీఆర్ ఎంతో ప్రేమతో ఈ పాత్రలో ఒదిగిపోయారని ఆయన తెలిపారు. ‘ఛత్రపతి’ ప్రసాద్ అనిపించుకోవడం ఆనందం! ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో బీవీయస్‌యన్ ప్రసాద్ నిర్మించిన ‘ఛత్రపతి’ విడుదలై, బుధవారానికి పదేళ్లయ్యింది. ఈ సందర్భంగా బీవీయస్‌యన్ మాట్లాడుతూ - ‘‘నిర్మాతగా నా తొలి చిత్రం ‘డ్రైవర్ బాబు’. 1986లో విడుదలైన ఈ చిత్రంలో శోభన్‌బాబు హీరోగా నటించారు. అప్పట్నుంచీ 2005 వరకు ఎన్నో చిత్రాలు నిర్మించాను. ఆ విధంగా ఇండస్ట్రీలో నాకు చాలా గుర్తింపు వచ్చింది. కానీ, పబ్లిక్‌లో కూడా నాకో ఇమేజ్ తెచ్చిన చిత్రం ‘ఛత్రపతి’. 2005లో విడుదలైన ఈ చిత్రం నా ఇంటి పేరులా స్థిరపడిపోయింది. అప్పట్నుంచీ అందరూ నన్ను ‘ఛత్రపతి’ ప్రసాద్ అంటుంటారు. అది ఆనందంగా ఉంటుంది’’ అన్నారు. -
దోచేస్తా...
నాగచైతన్య తాజా చిత్రానికి ‘దోచేస్తా’ అనే టైటిల్ అనుకుంటున్నారట. టైటిల్ ఖరారు కాకముందే.. ఈ చిత్రం టీజర్ బయటకొచ్చేసింది. ఆ టీజర్లో టైటిల్ ఖరారు కాలేదంటూ... బ్రహ్మానందం సెటైర్లు కూడా విసిరారు. ఇటీవలే ఈ టైటిల్‌ని ఫిలింఛాంబర్లో రిజిస్టర్ చేసినట్లు వినికిడి. ‘స్వామి రారా’ ఫేం సుధీర్‌వర్మ దర్శకత్వంలో బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. థ్రిల్లర్ కామెడీ, లవ్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో మోసగాళ్లను మోసం చేసే ఘరానా మోసగాడిగా నాగచైతన్య కనిపించనున్నట్లు తెలిసింది. షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చిన ఈ చిత్రాన్ని జనవరి చివరి వారంలో విడుదల చేసే అవకాశం ఉందని యూనిట్ వర్గాల భోగట్టా. ‘1’ ఫేం కృతీ సనన్ నాయిక.