హలో.. ఛలో | rashmika mandanna, akhi new movie | Sakshi
Sakshi News home page

హలో.. ఛలో

Published Fri, Apr 13 2018 12:17 AM | Last Updated on Sat, Aug 3 2019 12:30 PM

rashmika mandanna, akhi new movie - Sakshi

అఖిల్‌, రష్మికా మండన్నా

‘ఛలో’తో టాలీవుడ్‌కి హలో చెప్పారు కన్నడ బ్యూటీ రష్మికా మండన్నా. ఈ సినిమాతో తెలుగు ఆడియన్స్‌ను ఆమె బాగా ఆకట్టుకున్నారు. దాంతో వరుస ఆఫర్స్‌ కొట్టేస్తున్నారు రష్మిక. ప్రస్తుతం నాగార్జున – నాని మల్టీస్టార్‌లో, విజయ్‌ దేవరకొండతో ఒక సినిమాలో యాక్ట్‌ చేస్తున్నారామె. ఇప్పుడు అఖిల్‌కు రష్మికా హలో చెబుతున్నారట.

అర్థం కావడంలేదా? ‘తొలిప్రేమ’ ఫేమ్‌ వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో అఖిల్‌ ఓ సినిమాలో యాక్ట్‌ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ లవ్‌స్టోరీలో అఖిల్‌ సరసన  హీరోయిన్‌గా రష్మికా మండన్నాను చిత్రబృందం ఎంపిక చేసిందని సమాచారం. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీయస్‌యన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా సంగీతం: తమన్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement